రోజాపై సొంత మీడియా కక్ష కట్టిందా?

మంత్రి రోజా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేడీ ఫైర్ బ్రాండ్ గా ఏపీ రాజకీయాల్లో పేరు గాంచారు. రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఏకి పారేయడంలో ఆమె దిట్ట.  2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు. సందర్భం వచ్చినప్పుడల్లా అటు పవన్ కల్యాణ్ ను, నారా లోకేశ్ ను, చంద్రబాబు నాయుడిని తూర్పార పట్టేవారు. ఇదే ఎల్లో మీడియా ఆగ్రహానికి కారణం అయింది.

ఆమెకు ఈ సారి టికెట్ రాదని.. మంత్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని.. సొంత పార్టీకి చెందిన నేతల నుంచే ఆమె అసమ్మతిని ఎదుర్కొంటున్నారని వార్తలు రాస్తున్నారు. సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు మంత్రి రోజాకు చుక్కలు చూపిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇస్తే గెలిపించేది లేదని తీర్మానిస్తున్నారు. ఇటీవల ఏకంగా మంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో రోజా ఆత్మరక్షణలో పడింది.

తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి వెంటపడటం ఎల్లో మీడియా నైజంగా మారింది. ప్రస్తుతం రోజా సొంత నియోజకవర్గంలో ఎదురీదుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హవా చూపినా.. నగరిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గ్రూపులు తయారయ్యాయి. నగరిలో వైసీపీ ముక్కలైపోయింది. గత రెండు సార్లు ఎన్నికల్లో గెలిపించిన వారే ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారు. ఇది ఎల్లో మీడియా ఆమె గురించి రాస్తున్న తీరు.

రోజాపై ఉన్న కోపంతో తెలుగుదేశం నాయకులతో టచ్ లో ఉన్న నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి లేనిపోని హంగామా సృష్టిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎవరైనా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే రోజాకు ఎదురు దెబ్బ. నగరిలో ఆమె ఓడిపోబోతుంది అంటూ రాసుకొస్తున్నారు. వాస్తవానికి గెలిపిస్తారా.. లేక ఓడిస్తారా అనేది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. కానీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టిన నాయకుల్లో ఎవరు అయినా టికెట్ కు అర్హత కలిగిన వారు ఉన్నారా అంటే లేదు. కేవలం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: