టీడీపీ రౌడీ రాజ్యానికి.. పవన్ మద్దతిస్తారా?

పవన్ కల్యాణ్ తన సహజ ధోరణిలో రాష్ట్ర ప్రగతి కోసం పొత్తు అంటున్నారు. అంతే కాదు ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం , దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే సీట్ల పొత్తులో భాగంగా బాగా తగ్గినవే జనసేనకే. 2019లో అరశాతం ఓట్లు వచ్చిన బీజేపీకి పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు కేటాయిస్తే.. ఆరు శాతం ఓట్లు వచ్చిన జనసేనకి 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ స్థానాలు మాత్రమే.

మరోవైపు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అంటే దానికి సమాధానంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అసాధ్యం అయ్యే పొత్తును సుసాధ్యం చేశా.. జగన్ ఆయన బలగాన్ని ఓడిద్దాం. మే 15 నాటికి వైసీపీ విముక్త ఏపీ తథ్యం. వైసీపీ వీధి రౌడీలను సాగనంపుదాం అని వ్యాఖ్యానించారు. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసేద్దాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే మాటలు 2018లో టీడీపీని విభేదించిన సమయంలోను చెప్పారు.  2019 కి వచ్చే సరికి మళ్లీ వైసీపీని గద్దెనెక్కనివ్వం అన్నారు. ఇప్పుడేమో తాజాగా టీడీపీని అధికారంలోకి తీసుకొద్దాం అంటున్నారు. అంటే అటు టీడీపీ, ఇటు వైసీపీ కి చెందిన నేతలు ఇద్దరూ రౌడీలేనా.. ఉన్నదాంట్లో మంచి వారిని వెతుక్కొని ఏపీ ప్రజలు 2019లో ఎన్నుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నాయి.

సహజంగా ఎవరైనా రౌడీలు లేని.. అల్లర్లు జరగని ప్రశాంత పరిపాలన ఉండాలని ప్రజలు కోరకుంటూ ఉంటారు. అది ఎవరితో సాధ్యం అని భావిస్తే వారినే ఎన్నుకుంటారు. చంద్రబాబు వల్ల అది సాధ్యం కాలేదు అని జగన్ కు పట్టం కట్టారు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూద్దామన్నా  ఆ అవకాశం ఇవ్వకుండా పవన్ మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా 21 సీట్లతో. ప్రస్తుతం వైసీపీ రౌడీ రాజ్యాన్ని తీసేసి.. టీడీపీ రౌడీ రాజ్యాన్ని తెస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ మాటల వెనక ఆంతర్యం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: