గీతాంజలి మరణం.. మరో బరితెంగింపు వీడియో?

ఏపీ సర్కారు లబ్ధి పొంది ఆ ఆనందాన్ని బహిరంగంగా వెల్లడించడమే ఆమె చేసిన నేరమని భావించాలో.. లేక సమాజంలో విచ్చలివిడి తనం బరితెగింపు తత్వం వెర్రి తలలు వేసుకొని నెట్టింట తిరుగుతుందన్న విషయం ఆమె గ్రహించలేదని అనుకోవాలో అర్థం కావడం లేదు. మొత్తానికి అయితే ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఆమె మృతికి కారణమైన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లమైనట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడితో ఆగని టీడీపీ సోషల్ మీడియా టీంలు.. తమ అకౌంట్లో ఫేక్ వీడియోలు సృష్టించి దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ, జనసైనికులు సోషల్ మీడియా మరో తప్పుడు ప్రచారానికి సిద్ధం అయింది. సన్సేషనల్ అంటూ ఒక వీడియోను విడుదల చేశాయి. అందులో గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో లోకో పైలెట్ ఆమెను రైలులోని రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చిన దృశ్యాన్ని చూపిస్తూ ఆమెను ఎవరో తోసేశారంటగా మావా.. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా వాయిస్ ఓవర్ తో ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు.

ఇంటి పట్టా వచ్చినందుకు ఆనందంగా మీడియాతో మాట్లాడినందుకే ట్రోల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందని దాని నుంచి బయట పడేందుకు గీతాంజలి క్యారెక్టర్ ను తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విమర్శలున్నాయి.  ఆమె ఎవరో ఇద్దరితో రైల్వే స్టేషన్ కు వచ్చినట్లుగా వారు ఆమెను రైలు నుంచి తోసేసినట్లుగా వాయిస్ ఓవర్ తో ప్రచారం చేస్తోంది. ఆ వీడియో గమనించిన ఎవరికైనా ఇది ఫేకే అని ఇట్టే తెలిసిపోతుంది. మరోవైపు ఇది ఫేక్ వీడియో అని పోలీసులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆమె మరణాంతరం కూడా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని దీనికి మించిన నిస్సిగ్గు చర్య మరొకటి ఉండదని పలువురు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: