రహస్యం: గీతాంజలిని చంపింది ఎవరు?

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి అనే సాధారణ మహిళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె చావుకు మీరంటే మీరు కారణమంటూ రాజకీ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి.  వైసీపీ ప్రభుత్వం ద్వారా తాము లబ్ధి పొందామని ఓ యూట్యాబ్ ఛానల్ తో మాట్లాడిన ఒకే లబ్ధిదారుడికి రెండు సార్లు ఇల్లు ఎలా వచ్చింది ?

అమ్మ ఒడి ప్రారంభించి ఐదేళ్లు కాకున్నా.. ఐదు సార్లు ఆమెకు ఎలా పథకం వచ్చింది. అని ఇలా రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వైసీపీ ప్రభుత్వమే ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తోందని ఆరోపించారు. సీన్ కట్ చేస్తే ఈనెల 7న తెనాలికి చెందిన గీతాంజలి రైలు కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు.

అయితే వీటిని తిప్పికొట్టే క్రమంలో టీడీపీ ఆమెను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ సోషల్ మీడియాలోను, అఫీషియల్ మీడియలోను ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా కామెంట్లు పెడుతున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకి తోసేసి పరారు అయ్యారంటూ ఒక వీడియోలు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు చూపిస్తూ మార్ఫింగ్ వీడియో చేస్తూ సర్క్యూలేట్ చేస్తున్నారు. అయితే ఇది ఎడిట్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారని పోలీసుల విచారణలో స్పష్టమైంది.

అయితే ఇప్పుడు దీనిని ఎవరు సర్క్యులేట్ చేశారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పట్టే విధంగా తెలుగుదేశం సోషల్ మీడియా బురదజల్లుతోంది. లోకో ఫైలెట్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో అసలు ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేదని..ఆమె ఒక్కతే వచ్చి ఆత్మహత్యాయత్నం చేసిందని అర్థం అవుతుంది. అయినా తెలుగుదేశం నేతలు ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని మానుకోవాలని.. ఇలాంటి వాటిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: