బాబుపై పాత వీడియోలను ప్రయోగిస్తున్న వైసీపీ?

ఏపీ ఎన్నికల సందర్భంగా పొత్తుల రాజకీయం నడుస్తోంది. నీకు ఇన్నీ.. నాకు ఇన్నీ అని సీట్లను పంచుకుంటున్నారు. సీఎం జగన్ ఒంటరిగా బరిలో నిలవగా.. చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీలతో కలిసి 2014 సీన్ ను రిపీట్ చేస్తున్నారు. మొన్నటి వరకు పొత్తు ఉంటుందా.. ఉండదా అనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఎన్డీయేలోకి టీడీపీ చేరిపోయింది.

ఇంత వరకు బాగానే ఉన్నా.. గత ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బటయకు వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి అమిత్ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్లీ వేదికగా నిరసన దీక్ష చేపట్టి.. మోదీ భార్య గురించి.. కుటుంబం గురించి పలు ప్రశ్నలు సంధించారు. తిరుపతి పర్యటనుకు వచ్చిన అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఆరోపించారు.

అయితే ఇవన్నీ మరిచిపోయి బీజేపీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంది. కానీ వైసీపీ సోషల్ మీడియా ఈ పాత వీడియోలను బయటకు తీసి ప్రచారం చేస్తోంది. అయితే సగటు బీజేపీ అభిమాని కూడా వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మీద ద్వేషంతోనే వారంతా వైసీపీకి అనుకూలంగా పనిచేసి ఓట్లు వేసి జగన్ ను గెలిపించారు.

అయితే తనను తిట్టిన చంద్రబాబును మోదీ అమిత్ షా లే మర్చిపోయారు. వాటిని వదిలేశారు. అందుకే పొత్తు ప్రకటించారు.  అందుకే పొత్తుల కోసం ఎంత చేయాలో అంత చేసి.. చంద్రబాబుని పడిగాపులు గాయించి.. దిల్లీలో రెండు రోజులు ఉంచి మరీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో ప్రాతినిథ్యం అవసరం. అది టీడీపీ, జనసేనతో నెరవేరుతుందని పార్టీ అధిష్ఠానం భావించింది. అందుకు అనుగుణంగా పొత్తులు ఖరారు చేసింది. నరేంద్ర మోదీ, అమిత్ షా లే మర్చిపోయినప్పుడు కార్యకర్తలు బాధపడాల్సిన పనేముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: