పొత్తులు: బాబును వణికిస్తున్న 2009 ఫ్లాష్‌బ్యాక్‌?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో జట్టు కట్టడం ఇదేమి మొదటి సారి కాదు. పొత్తు పెట్టుకోవడం ఆయనకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి పొత్తుల కోసం పడిన పాకులాట ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడలేదు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో టీడీపీ ఘన విజయం సాధించింది. 2004లో ఓడిపోయింది. మళ్లీ 2014లో గెలిచింది. మరి ఈ సారి 2024లో ఏం జరుగుతుందో చూడాలి.

ఓట్ల బదలాయింపుపై సీరియస్ గా దృష్టి సారించకపోతే.. ఈ కూటమి ఓటమి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొత్తు ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ కల్యాన్ పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నారు. అయితే వీరు ఆశించిన విధంగా ఓట్ల బదలాయింపు జరగకపోతే.. ఈ కూటమి ఆశలకు గండి పడినట్లే. దీనికి 2009లో జరిగిన ఎన్నికలను విశ్లేషకులు ఉదాహరణగా చూపుతున్నారు.

2004లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.  2009లో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ను ఢీ కొనేందుకు చంద్రబాబు నాయుడు మహా ఘట్ బంధన్ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. కానీ ఆనాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో ఆ ప్రతిష్ఠ రాష్ట్రంలో పనిచేసింది. టీడీపీ ఓటమికి కారణం అయింది.

అప్పటి లెక్కలు ఓ సారి  పరిశీలిస్తే.. 2004లో 29 ఎంపీ సీట్లను గెలుచుకుంటే.. 2009లో 33కి ఎగబాకింది. ఇదే సమయంలో టీడీపీ కి అంతకుముందు నాలుగు సీట్లు రాగా.. 2009 ఎన్నికల్లో అయిదు సీట్లు వచ్చాయి. అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే.. 2004లో టీడీపీకి 47 సీట్లు రాగా.. 2009లో 92 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కు 185 సీట్లు రాగా.. 2009లో 166 సీట్లు వచ్చాయి. మొత్తం మీద 2009లో మహా ఘట్ బంధన్ ఓట్లు బదలాయింపు జరగకపోవడం వల్ల ఓటమి పాలైంది. ఈసారి కూడా ఇదే జరిగితే 2009 సీన్ రిపీట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: