అమిత్‌షా ట్రాప్‌లో చంద్రబాబు పడిపోయారా?

ఏపీ పొత్తుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన బీజేపీ కూటమి ఖాయమైన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపు ప్రక్రియన పూర్తైంది. అయితే టీడీపీకి కార్యకర్తలే బలం. అదే గుండెకాయ లాంటిది. బీజేపీ, జనసేన నేతలు పొత్తులను ఎలా స్వీకరిస్తున్నారో తెలియదు కానీ.. టీడీపీ శ్రేణులు మాత్రం పూర్తిగా సన్నద్దమవుతున్నారు.

ఈ మేరకు టీడీపీ అభిమాని పెట్టిన పోస్టు వైరల్ గా మారుతోంది. టీడీపీ పోటీ చేయాలి అనుకున్న సీట్లు 145 ఎమ్మెల్యే, 18 ఎంపీస్థానాలు. ఆల్రెడీ జనసేనకి 24 కేటాయించారు. బీజేపీకి మిగిలిన ఆరు స్థానాలు ఇస్తారు. వైసీపీకి ఫేవర్ గా ఉన్న ఎంపీ సీట్లు అరకు, తిరుపతి, రాజంపేట, కడప. బీజేపీ పై నాలుగు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. నర్సాపురంతో పాటు ఇంకో ఎంపీ సీటు ఇవ్వొచ్చు. ఎన్ని సీట్లు ఇస్తారో కంటే.. ఏయే స్థానాలు కేటాయిస్తారో మనం చూడాలి.

విష్ణు కుమార్ రాజు, కామినేని, ఆది నారాయణ రెడ్డి, వరదాపురం సూరి లాంటి వారికి సీట్లు ఇస్తే ఓటు బదలాయింపు జరుగుతుంది. ఎంపీల్లో కూడా కొత్తపల్లి గీత, పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ , సుజనా, రత్నప్రభ లాంటి వారికి ఇచ్చినా ఓటు ట్రాన్స్ ఫర్ జరగుతుంది. ఇలా కాకుండా బీజేపీలో వైసీపీ బ్యాచ్ కి టికెట్లు ఇస్తే డిపాజిట్ లు కూడా రావు. బీజేపీ చేతిలో ఓట్లు లేవు. సిస్టం మాత్రమే ఉంది.

వాళ్లు టీడీపీ సీట్లు గెలిపించాలి. బీజేపీ వాళ్లు కనీసం సక్రమంగా జరిగేలా చూసినా చాలు. అదే పొత్తు. సిస్టమ్ న్యూట్రల్ తన పని తాను చేసుకుంటే చాలు. జగన్ కుప్పకూలిపోతారు. జగన్ చేతిలో ఇప్పుడు నాయకులు లేరు. కార్యకర్తలు లేరు. అతని చేతిలో డబ్బు ప్లస్ అధికార యంత్రాంగం ఉంది. డబ్బు వాడాలి అన్నా.. సిస్టం చేతిలో ఉండాలి. ఆ సిస్టంను జగన్ దగ్గర నుంచి వేరు చేయడానికే ఈ పొత్తు. సీట్లు ప్రకటించిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: