ఆ చౌదరి గారికి అవకాశం లేనట్టేనా?

ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖరారైంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సైతం పూర్తైంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అనే దానిపై స్పష్టత రాకపోయినా ఒక ప్రాథమిక నిర్థారణకు అయితే వచ్చారు. గత రెండు రోజులుగా దిల్లీలో ఉన్న చంద్రబాబు, పవన్ లు బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయి పొత్తు ఫిక్స్ చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా లు చంద్రబాబు కు ఎన్డీయేలో కి స్వాగతం పలికారు. ఇక టీడీపీ చేరడం లాంఛనంగా మిగిలింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆరు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. చాలామంది సీనియర్లు ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నాయకులు సుచనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎందుకంటే గతంలో వీరు టీడీపీ రాజ్యసభ ఎంపీలుగా ఉండి బీజేపీలోకి ఫిరాయించారు. టీజీ వెంకటేశ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు టీడీపీ తరఫున కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. మిగిలిన ఇద్దరూ సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు.

సీఎం రమేశ్ విశాఖపట్నం కానీ ఏలూరు లోక్ సభ స్థానం అడిగారు. సుజనా చౌదరి విజయవాడ ఎంపీ స్థానాన్ని కోరుతున్నారు. అయితే తాజా పొత్తు చర్చల్లో వీరిద్దరి పేర్లు ప్రస్తావనకు రాలేదన్న మాట వినిపిస్తోంది. అటు ఏలూరు, విజయవాడ ఎంపీ స్థానాలను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. దీంతో సుజనా చౌదరి, సీఎం రమేశ్ ల స్థానాలకు గండి పడినట్లే. మరోవైపు ఆరు ఎంపీ సీట్లే ప్రకటించిన క్రమంలో వీరి పేర్లను ఆయా స్థానాల్లో పార్టీ పరిశీలిస్తున్నట్లుగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: