పొత్తు ఎఫెక్ట్‌: 2014 సీన్‌ రిపీట్‌ అవుతుందా?

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దఫాలుగా పార్టీ ముఖ్య నేతలతో చర్చల తర్వాత ఎన్డీయేలోకి ఈ రెండు పార్టీలు చేరేందుకు అంగీకారం లభించింది. శనివారం బీజేపీ అగ్ర నేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సీట్ల సర్దుబాటు పై చర్చించారు.

చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీయే ఎన లేని కృషి చేస్తోందని వివరించారు.

1996 లో టీడీపీ ఎన్డీయేలో జాయిన్ అయింది. సుదీర్ఘకాలం టీడీపీతో కలసి పనిచేశాం. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేశాం. టీడీపీ పాత మిత్రపక్షమే. ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తాం అని జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. డైనమిక్, దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రగతికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని నడ్డా చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. సీట్ల విషయంపై ప్రకటించకపోవడమే. ఎన్ని స్థానాల్లో పొటీ చేసేది రెండు రోజుల్లో తేలుతుందని  జేపీ నడ్డా స్పష్టం చేశారు. కానీ ఎల్లో మీడియా మాత్రం 30 సీట్లకి మించి ఇచ్చేది లేదన్నట్లు చెబుతోంది.  కానీ పొత్తు ఉందనే విషయంపై అధికారిక ప్రకటన రావడంతో టీడీపీ, జనసేన శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. 2014 సీన్ రిపీట్ అవుతుందని విశ్వసిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: