పవన్‌కు అప్పుడే బాబు వెన్నుపోటు మొదలైందా?

టీడీపీ జనసేన పోత్తులో భాగంగా జనసేన తీసుకున్న సీట్లు చాలా తక్కువ. ఈ 24 సీట్లతో పవన్ ఏపీ రాజకీయాల్లో సాధించేది పెద్దగా ఏదీ ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ కారణంగా కాపు వర్గం పవన్ కు దూరమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటిని కప్పి పుచ్చుకునేందుకు తనకు సలహాలు ఇచ్చే కాపు నాయకులు వైసీపీలో చేరుతున్నారంటూ  కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు కొన్ని వ్యూహాలు ఉన్నాయంటూ కవర్ చేసేందుకు యత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా జనసేన పోటీ చేసే స్థానాలను పవన్ కి చెప్పామని ఆ సీట్లలో అభ్యర్థులను ఆయనే ప్రకటిస్తారని చంద్రబాబు తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇచ్చిన 24 సీట్లలోనే పవన్ కల్యాణ్ చంద్రబాబు కి కొన్ని గిఫ్ట్ ల కింద ఇస్తున్నారు. అవేంటంటే… రాజమండ్రి తనకు సెంటిమెంట్ అని కచ్ఛితంగా ఇక్కడ జనసేన అభ్యర్థే బరిలో ఉంటారని పవన్ వ్యాఖ్యానించారు.

తీరా ఇప్పుడు చూస్తే.. రాజమండ్రి రూరల్, అర్బన్ లో రెండు చోట్ల జనసేన అభ్యర్థులు బరిలో లేరు. రూరల్ బరలో ఉన్న దుర్గేశ్ ని నిడదవోలు కి వెళ్లేందుకు ఒప్పించారు. తద్వారా బుచ్చయ్య చౌదరికి న్యాయం చేసి ఆ స్థానాన్ని చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇచ్చారు. మరోవైపు పి.గన్నవరం నుంచి జనసేనను పోటీ చేయాలని టీడీపీ కోరుతోంది. అంటే దీనికి బదులుగా మరో స్థానాన్ని పవన్ త్యాగం చేయాలి.

చంద్రబాబు అడిగిదే తడవుగా పవన్ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దానికి బదులు మాడ్గుల సీటు జనసేనకు ఇచ్చి దీనిని టీడీపీ తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. దీనిని కూడా తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. వీటితో పాటు భీమవరం, నర్సాపురంలో కూడా టీడీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన సీట్లలోనే తిరిగి పవన్ ఆయనకే  గిఫ్ట్ గా ఇస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: