జగన్‌కు పొంచి ఉన్న పెను ప్రమాదం?

ఏపీలో పొత్తుల దిశగా అడుగులు పడ్డాయి. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరింది. పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఇటీవల దిల్లీ వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు అమిత్ షా తో భేటీ అయ్యారు. పొత్తుతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య ఆరోగ్యకర చర్చలు జరిగాయి. సూత్రాప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి వచ్చారు.

వాస్తవానికి టీడీపీ, జనసేన కూటమిలోకి చేరకుండా ఉండేందుకు జగన్ చాలా రకాలుగా ప్రయత్నించారు. రకరకాలుగా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత నెలలో చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిసినప్పుడు వెనువెంటనే జగన్ కూడా దిల్లీ బాట పట్టారు. ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకోవద్దని కోరినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాత పొత్తుల చర్చలు జరగకపోవడం.. ఆ ప్రస్తావనను ఇరు పార్టీలు తీసుకురాకపోవడంతో జగన్ విజయవంతం అయ్యారు అనుకున్నారు అంతా..

కానీ అనూహ్యంగా మళ్లీ చర్చలు ఓ కొలిక్కి రావడంతో వైసీపీ అంతర్మధనంలో పడినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి అన్ని స్థానాల్లో గెలవలేమని  ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఇష్టం లేని అధికారులు ఎదురు తిరుగుతారు. దీంతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు పెంచుతారు. వీరికి మీడియా అండ ఎలాగూ ఉంది.

రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కోల్పోతామా అనే భావన వైసీపీలో ఏర్పడింది. ఎందుకుంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వైసీపీతో సఖ్యతగా ఉన్న  కేంద్రం ఇప్పటి నుంచి నిధుల మంజూరు లో ఆచుతూచి వ్యవహరిస్తారు. దీంతో జగన్ ఇష్టం వచ్చినట్లు బటన్లు నొక్కినా ప్రయోజనం ఉండదు. దీంతో పాటు పార్టీకి అండగా నిలిచే వ్యాపారులు, పెట్టుబడుదారులు ఇప్పుడు ఎటు వైపు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో వైసీపీకి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని జగన్ ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: