ఆగని జగన్‌ డబ్బులు.. ఓట్లు కురిపిస్తాయా?

చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని..  తమ కాళ్లమీద తాము బతికేలా మహిళలకు చేయూతను అందిస్తోన్న పథకం వైఎస్సార్ చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల కోసం 26 లక్షల 98 వేల 931 మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికీ రూ.1875. చొప్పున ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబాల మహిళలు శాశ్వత జీవనోపాధి పొందేలా 2020 ఆగస్టు 12 ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా ఒక్కో విడతలో రూ.18750 చొప్పున ప్రతి అర్హురాలైన మహిళకు రూ.75 వేలను వారి ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 27 లక్షల మంది మహిళలకు ఇంత మొత్తంలో సాయం చేయడం మామూలు విషయం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఒక్క పథకానికే వైసీపీ ప్రభుత్వం రూ.17,189 కోట్ల వరకు ఖర్చు పెట్టింది.

అయితే ఇలా డబ్బులు వేయడం ప్రజలు కోరుకోవడం లేదని.. వాళ్లు ఉపాధి కోరుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలతో సహా.. జయప్రకాశ్ నారాయణ్ వంటి మేధావులు అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్ మాత్రం తన విధానాన్ని ఏం మార్చుకోవడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం మహిళల ఖాతాల్లో నిధులు జమ చేస్తూనే ఉన్నారు.

తాము వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే భ్రమ కల్పించి రాజకీయ లబ్ధి పొందడం తప్ప చంద్రబాబు ఉన్నా ప్రగతి ఆగదు.. జగన్ ఉన్నా అభివృద్ధి చేయడం ఆపరనేది విశ్లేషకుల వాదన.  ప్రజలు సంక్షేమం కోరుకోవడం లేదని ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తలు చెప్పినా.. జగన్ ఏ మాత్రం తగ్గడం లేదు.  కరోనా లాంటి విపత్కర సమయంలోను మహిళల ఖాతాలో నిధుల విడుదలన జగన్ ఆపలేదు. ఇన్ని వేల రూపాయలు జమ చేయడం మంచిదా కాదా అనే విషయంపై చర్చ జరగాలి కానీ.. ఒకరు చేస్తే మంచి.. మరొకరు చేస్తే దుబారా వంటి అంశాలపై మాట్లాడితేనే తప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: