వైసీపీ కాపు ఫార్ములా.. వర్కవుట్‌ అవుతుందా?

ఏపీలో జరిగే ప్రతి ఎన్నికల్లో కాపు ఓటర్లే గెలుపోటముల నిర్దేశకులు. వారి మద్దతు ఎవరికి ఉంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. 2014లో కాపులు టీడీపీకి అండగా నిలిచారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడ్డారు. 2019కి వచ్చే సరికి వైసీపీ వైపు మళ్లారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అందుకే ఈ ఎన్నికల్లో కాపు ఓట్ల కోసం అటు చంద్రబాబు, ఇటు జగన్ తీవ్రంగా యత్నిస్తున్నారు.

అయితే ఈసారి కాపులో మెజార్టీ వర్గం పవన్ వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా వైసీపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే  చంద్రబాబు తెలివిగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో జగన్ ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. కాపు ఫార్ములాను బయటకు తీస్తున్నారు. కాపులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన్నట్లు చూపించాలని ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చినా కాపు నాయకుల నియోజకవర్గాను మార్చేందుకు జగన్ సాహసించలేదు. ఒక్క గుడివాడ అమర్నాథ్ ని తప్పించి కాపు మంత్రుల జోలికి వెళ్లలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను వీలైనంత వరకు కొనసాగించారు. మొత్తంగా టీడీపీ, జనసేన కాపులకు ఇచ్చే సీట్ల కన్నా.. ఒక రెండు, మూడు ఎక్కువ సీట్లు ఇచ్చేలా జగన్ కసరత్తులు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.  మరోవైపు కాపు పెద్దలుగా ఉన్న ముద్రగడ, హరిరామ జోగయ్య వంటి నేతల కుటుంబాలను వైసీపీ వైపు రప్పించుకున్నారు.

ఈ చర్యలన్నీ కాపు ఫార్ములాలో భాగంగానే జగన్ చేసినట్లు తెలుస్తోంది. కాపు నేతలకు తగు రాజకీయ ప్రాధాన్యం ఉదాహరణకు చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, మాజీ మంత్రి పేర్ని నాని లకు ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గ నేతలే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ ఆ సామాజిక వర్గం బలంగా ఉంది.  అయినా ఇక్కడ కాపు నేతను జగన్ బరిలో ఉంచారు. టీడీపీ, జనసేన కన్నా తానే కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాననే భావనను కాపుల్లో తీసుకెళ్లేందుకు జగన్ యత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: