వివేకా కేసు.. జగన్‌కు పెద్ద దెబ్బే?

ఎన్నికలు అంటేనే ఒక ఎమోషన్. ఒక అంశం ప్రజల్లోకి వెళ్తుంటే దానికి కౌంటర్ గా ప్రతిపక్షాలు కానీ.. అధికార పక్షాలు కానీ పలు విమర్శలను సంధిస్తుంటారు. 2014 లో ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన సందర్భంలో అభివృద్ది ఎజెండాగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు.

2019 వచ్చే సరికి.. ఈ ఎమోషన్ మారిపోయింది.  తెలంగాణలో చంద్రబాబు మనల్ని దెబ్బకొట్టబోయారు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చబోయారు. ఆ తర్వాత బద్ధ శత్రువు కాంగ్రెస్ తో జట్టు కట్టి తెలంగాణను మళ్లీ నాశనం చేయాలని చూస్తున్నారు అని ఒక ఎమోషన్ సృష్టించి టీఆర్ఎస్ లబ్ధి పొంది ఘన విజయం సాధించింది. ఏపీకి వచ్చే సరికి తన ఎమ్మెల్యేలను 23 మందిని చంద్రబాబు తీసుకెళ్లారు.  దీంతో పాటు నా బాబాయిని చంపారు అనే సెంటిమెంట్ తో వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.

రెండు చోట్ల చంద్రబాబు ఎజెండాగానే ఎన్నికలు జరిగాయి. ఆయన తెలంగాణలో..ఏపీలో దెబ్బతిన్నారు. ఈ సారి ఎన్నికల విషయానికొస్తే.. నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది అని భావిస్తేనే నాకు ఓటేయ్యండి.. లేకపోతే లేదు అని జగన్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ సారి తెలుగుదేశం  ఏ ఎజెండాతో ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. గతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యమని అడగాలంటే.. అప్పుడే 23 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఆ అంశంతో ఎన్నికలకు వెళ్లలేరు.

సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేసుకుందామంటే.. జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతోనే రాష్ట్రం దివాళా తీస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అంతకుమించి అంటే అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఆటోమేటిక్ గా ఉత్పన్నమవుతుంది. అందుకే ఈ సారి సెంటిమెంటల్ గా వివేకా హత్య కేసును వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏం చేస్తారు అనే ఒక ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. అందుకే ప్రతి సభలోను హూ కిల్డ్‌ బాబాయ్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: