ఆ ఎన్నికలు.. ప్రపంచ గతినే మార్చేస్తాయా?

మరో నెలన్నర రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై అటు కాంగ్రెస్ పార్టీ .. ఇటు బీజేపీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్నికలు  మన దేశంలోనే కాదు. పలు దేశాల్లో ప్రపంచ గతిని మార్చే ప్రజాభిప్రాయం ఈ ఏడాదిలో జరగనుంది. కొన్ని కీలక దేశాల్లో జరిగే ఎన్నికలు అక్కడ ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రపంచ గతిని మార్చేయబోతున్నాయి.

అందులో మొదటిది భారత దేశం. మన దగ్గర తిరిగి మూడో సారి ప్రధాని గా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరిస్తే.. అంతర్జాతీయంగా జరిగే పరిణామాల్లో భారత్ పాత్ర కీలకంగా ఉండనుంది. మన దేశానికి విలువ పెరిగి కొన్ని దేశాలు మనం చెప్పినట్లు గా వినే పరిస్థితులు ఉండనున్నాయి.  మరోవైపు మూడేళ్లుగా ఎడతెగని యుద్ధాలు జరుపుతున్న ఉక్రెయిన్ రష్యా తో పాటు తీవ్ర మారణ హోమం సృష్టిస్తున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలను చర్చల ద్వారా పరిష్కరించే సత్తా మోదీ సొంతం.

మన ప్రధాని చెబితే అటు రష్యా కానీ.. ఇటు ఇజ్రాయెల్ కానీ శాంతించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారీ మెజార్టీతో నరేంద్ర మోదీ విజయం సాధిస్తే ప్రపంచంపై భారత్ ముద్ర అంత బలంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ లో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇందులో ప్రస్తుతం కొనసాగుతున్న కొమైనీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడితే.. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. మరొక వైపు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జో బైడెన్ మళ్లీ అధ్యక్ష పీఠం చేపడితే ఈ యుద్ధాలు కొనసాగే అవకాశం ఉంది.  ఎందుకంటే ఆయుధ వ్యాపారం కోసం పలు దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలు కొనసాగేలా చేస్తారు.  ఈ మూడు దేశాల్లో ఏర్పడే ప్రభుత్వాలపైనే  ప్రపంచ శాంతి ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: