టికెట్ల కేటాయింపులో బాబు ఫార్ములా ఇదే?

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ లో జరగనున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఉమ్మడి జిల్లాల్లో దాదాపు అన్ని ఇన్ ఛార్జిల పేరుతో అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే టీడీపీ ఈ విషయంలో ఎప్పటిలాగే వెనుకబడిపోతుందన్న భావన ఇప్పటి వరకు నెలకొంది. అయితే అనూహ్యంగా శనివారం టీడీపీ, జనసేన కూటమి అధి నేతలు ఒకేసారి 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ పట్ల విధేయత, నిరంతర ప్రజా సంబంధాలే గీటురాయిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకొని కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. అయితే చాలా చోట్ల ఇద్దరు పార్టీ విధేయులే అయినప్పుడు ఒక్కరి వైపు మొగ్గు చూపడం సాధారణంగా జరిగేదే. కొన్ని స్థానాలను మనం గమనించినట్లయితే …పులివెందులలో గత ఎన్నికల్లో జగన్ పై సతీశ్ రెడ్డి పోటీ చేశారు. తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు.


తిరిగి మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ఆయన సిద్ధపడ్డా ఈసారి మాస్ లీడర్ బీటెక్ రవిని బరిలో దింపింది. అలాగే అన్నమయ్య జిల్లా రాయచోర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రమేశ్ కుమార్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  బావ ద్వారాకా ఆదిరెడ్డి ఇద్దరూ టికెట్ ఆశిస్తే స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాం ప్రసాద్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడ విధేయత పక్కకి వెళ్లిపోయింది.

తమ్మళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తో పాటు లక్ష్మీ దేవమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించగా చివరకు జయచంద్రారెడ్డిని బరిలో దింపారు. మైదుకూరు టికెట్ కోసం డీఎల్ రవీంద్రారెడ్డి ప్రయత్నించగా..పుట్టా సుధాకర్ యాదవ్ కి ప్రకటించారు. కల్యాణ దుర్గంలో 2019లో ఓడిపోయిన ఉమా మహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే వనం హనుమంతరాయ చౌదరి పోటీ పడగా విస్త్రృత పరిచాయలున్నా సురేందర్ ని పోటీలో నిలిపారు. కొన్ని చోట్ల విధేయతకే అకవాశం దక్కినా కొన్నిచోట్ల మొండి చేయే ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: