వారెవా.. ఆంధ్రాలో ఉద్యోగాలే ఉద్యోగాలు?

ఏపీలో నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగాలు లేవు. ఉపాధి కల్పన లేదు. ఏపీ యువత అంతా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలు తరలి వెళ్తున్నారు. అని ఎల్లో మీడియా తరచూ ఆరోపిస్తూ వస్తోంది. ఒక్కసారి వైసీపీ పాలనలో వెనక్కి తిరిగి చూసుకుంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే జగన్ ఉద్యోగాల జాతరను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ఏకకాలంలో సుమారు లక్షా అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు వరకు ఇంత భారీ మొత్తంలో నియామకాలు ఎప్పుడూ చేపట్టలేదు. కానీ జగన్ దానిని చేసి చూపించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రవేశ పరీక్షలు రాసి ప్రొబెషనరీ పూర్తి చేసుకొని ఇప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వైద్యులు  ఇతరత్రా  కొలువులు మరో 60వేల వరకు ఉండొచ్చు.  కానీ ఆ తర్వాత నుంచి ఉద్యోగాల నియామకాలు లేకపోవడంత పాటు ఏటా విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం సీఎం వైఎస్ జగన్ కు కొంత మైనస్.

ఆ తర్వాత మళ్లీ 6500 వరకు పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీని ప్రకటించారు. కాకపోతే ఎన్నికల వరకు వేచి చూసి ప్రకటించడమే అతి పెద్దదైన ప్రతికూలాంశం. డీఎస్సీ నోటిఫికేషన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయంలో విడుదల చేశారు.

మొత్తం 6100 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.  ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. 6100 ఉపాధ్యాయ పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 2280 ఎస్జీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు, 1264 టీజీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ ఈనెల 12 నంచి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందన్నారు. మార్చి 5నుంచి హాల్ టికెట్లు,  మార్చి 15 నుంచి 30వరకు పరీక్షలు ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: