మోడీ ప్రేమ కోసం పరితపిస్తున్న బాబు, జగన్?

ఏపీ రాజకీయాలది విచిత్ర పరిస్థితి. ఇక్కడి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా బీజేపీతో సఖ్యత కోసం పరితపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు మాకు 15ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు.. ఆరోజుల్లో ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారు కూడా.. ఇక జగన్ అయితే.. మూకుమ్మడిగా రాజీనామా చేయాలన్నారు కూడా. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు.

అందుకే ఇప్పుడు వైఎస్‌ షర్మిల వంటి వారు కూడా జగన్, చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని అడుగుతున్నారు. చంద్రబాబు, జగన్ భాజపాకు తొత్తులుగా మారారని.. ఆంధ్రాలో భాజపా రాజ్యమేలుతోందని.. పదేళ్లుగా భాజపాకు తొత్తులుగా గులాం గిరీ చేస్తున్నారని షర్మిల అంటుంటే ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇక భాజపా కూడా గతంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు.. నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.... అమిత్ షా, భాజపా మెప్పు కోసం వెళ్లారు.

తాజాగా ఢిల్లీ వెళ్లిన జగన్ కూడా ఢిల్లీ వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేస్తారు.. జగన్, చంద్రబాబు.. ఇద్దరికీ భాజపా కావాలి.. బాబు, జగన్.. ఈ ఇద్దరూ భాజపాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే... పొత్తు పెట్టుకుంటాం అని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అసలు ఈ పరిస్థితి చూస్తుంటే.. ఒక్కరికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన లేదంటున్నారు సగటు ఆంధ్రులు.. ప్రత్యేక హోదా ఆంధ్రాకు సంజీవని లాంటిది.. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి.. అందులోనూ అది విభజన సమయంలో ప్రధాని ఇచ్చిన హామీ అయినా దాని కోసం పట్టుబట్టే వారే కనిపించట్లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా నినాదం మళ్లీ ఎత్తుకుంది. తాము ఇచ్చిన హామీని తామే అమలు చేస్తామని చెబుతోంది. మరి ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా.. అంటే అదీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: