ఇండియా టుడే సర్వేతో వైసీపీలో వణుకు మొదలైందా?

ఇండియా టుడే సర్వే ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వేలో టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని.. వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ 17 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని.. వైసీపీ 8 గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే చెప్పింది. దీంతో టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోగా.. వైసీపీ నేతలు కాస్త డల్ అయ్యారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇండియాటుడే సర్వేను సీ ఒటర్ సంస్థ తో కలసి చేస్తోందని.. గతంలో చేసిన సర్వేల్లోనూ టీడీపీకి ఈ సర్వే ఎక్కువ సీట్లు ఇచ్చిందని అంటున్నారు.

ఈ సర్వే  విశ్వసనీయత ఏమిటనేది దీన్ని బట్టి తెలుస్తోందంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. భాజపా నేతలను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నేలను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ను భాజపా నేతలే పిలిచారని ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు  తప్ప మరో అవకాశం లేదన్నట్లు భాజపా నేతలు అనుకుంటున్నారని.. భాజపా తన స్థాయిని దిగజార్చుకుంటోందని..    ఇంత బతుకు బతికిన భాజపాకు ఇదంతా అవమానంగా అనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైనే ప్రధాని తో సీఎం జగన్ చర్చిస్తారన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. తెదేపాకు 18 మంది ఎమ్మెల్యేల ఉండగా మరో నలుగురు వైకాపా నుంచి పోయినవారే ఉన్నారని గుర్తు చేశారు. తెదేపా అభ్యర్థి ని నిలిపినా గెలిపించే బలం లేదని.. అసలు రాజ్యసభ రేసులో అభ్యర్థిని నిలపాలని తెదేపా  ఆలోచన చేయడమే అనైతికమని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు అమిత్ షాను కలిశారని.. అలాగే సీఎం హోదాలోనే  వైఎస్ జగన్ ప్రధానిని కలవబోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే  తెదేపా ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. తెదేపాకు బలముంటే పొత్తుల కోసం ఎవరి కోసం వెంటపడాల్సిన అవసరం ఉండదన్నారు. తెదేపా ఆఫీస్ లో చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు ఏమనాలనుకుంటున్నారో అవే మాటలు షర్మిల నోట వస్తున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: