షర్మిల వ్యూహం..బాబుకు అర్థమవుతోందా?

విషయం ఏదైనా, సందర్భం మరేదైనా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, విమర్శించడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని షర్మిళ వదులుకునేలా కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో ఆమె ప్రధాన ప్రతిపక్ష పోషిస్తుందనే చెప్పవచ్చు.  ఏపీసీపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా మాట్లాడుతున్నారు. రోజు రోజుకీ డోస్ పెంచుతూ జగన్ పై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.  

మరోవైపు చంద్రబాబుపై కూడా తీవ్రస్థాయిలోనే మండిపడుతున్నారు. అయితే సీఎం జగన్ ఏపీ కి ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. మూడు రాజధానులంటూ ఒక్క  రాజధాని కూడా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. పోలవరం ఇప్పటి వరకు పూర్తి కాలేదని.. రైల్వే జోన్ తో సహా ఏపీ విభజన హామీలను జగన్ ప్రభుత్వం సాధించలేకపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు దిల్లీ కేంద్రంగా వైఎస్ షర్మిళ రాజకీయం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా అంశంపై దిల్లీలో దీక్ష చేశారు. తనకు 20మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఊరు వాడా తిరగి ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. ఐదేళ్లలో ఒక్కసారి కూడా కేందర్ం వద్ద  వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించలేదని షర్మిళ  మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని లేవనెత్తి జగన్ పై ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

అయితే హోదా విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు అదే బీజేపీతో కలుస్తామంటున్నారు. ప్రస్తుతం కేంద్రం హోదా విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయినా బీజేపీ పొత్తు కోసం టీడీపీ, జనసేనలు ఎందుకు వెంపర్లాడుతున్నాయో ఈ విషయం కూడా చంద్రబాబుని అడగాలని షర్మిళకు పలువురు రాజకీయ విమర్శకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: