ఉద్యమాలతో అట్టుడుకుతున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీరం?

పాకిస్థాన్ ఒక్కసారిగా విలవిల్లాడుతోంది. ఒకవైపు బెలూచిస్తాన్ ప్రాంతాల్లో వివాదాలు, మరోవైపు బెలూచీ రెబల్స్ దాడితో పాటు ఇటీవల ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వీటికే ఆ దేశం కుదేలవుతుంటే మరోవైపు పాక్ లోని ఆక్రమిత కశ్మీర్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. సమృద్ధిగా ఉన్న వనరులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంతో విఫలమైందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సబ్సీడీ గోధుమల ధరల పెంచి భారం మోపండంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజల్లో పాకిస్థాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. ప్రజాందోళనలు నిత్యకృత్యంగా మారాయి. నిర్బంధం విధించినా కూడా ప్రజలు ఏమాత్రం బెదరకుండా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వనరులు సమృద్ధిగా ఉన్నా కూడా తాము చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోంటున్నామని బల్బిస్థాన్ ప్రజలు మండిపడుతున్నారు.

తమకు హక్కులే కాదు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ఇది చాలదన్నట్లు సబ్సిడీ గోధుముల ధరలను పెంచింది. ధర పెంచినా కూడా నాసిరకమైన గోధుములు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 75 ఏళ్లుగా సమృద్ధిగా నీరు ఉన్నా కూడా ఎలాంటి విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నాసిరకమైన గోధుములు సరఫరా చేయడం వల్ల ఆ పిండితో చేసిన చపాతీలు తిన్నవారు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం తమకు వసతుల కల్పించడం లేదని మండిపడుతున్నారు.

వేలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే మమ్మల్ని భారత్ లో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చైనా నిర్మిస్తున్న రోడ్డు పీవోకే మీదుగా వెళ్తోంది. ఆ రోడ్డుకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మితమైతే తమ జీవితాలు నాశనం అవుతాయని వారు ఆవేదన చెందుతున్నారు. వీటి వెనుక భారత్ ఉందని భావిస్తున్న పాక్ వీటిని ఎలా నిలువరించాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pok

సంబంధిత వార్తలు: