జగన్‌పై జనసేన తీవ్ర ఆరోపణ.. ఆలోచించాల్సిందే?

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశానికి ముందు హ్యాండిల్ ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటో ని పెట్టి అందులో ఒకదాన్ని హైలెట్ చేవారు. ఇవాళ సాయంత్రం నాదెండ్లతో పాటు ఒకరు సమావేశంలో పాల్గొంటారని వారెవరో.. చెప్పుకోండి చూద్దాం అంటూ పోస్టు పెట్టారు.

అందరూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీస్ లో పాల్గొంటారు అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ కుర్చీలో సీఎం జగన్ ఫొటో తీసుకొచ్చి పెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏనాడూ మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రి అందుకే.. మేం తీసుకొచ్చాం అని వివరించారు.  వైసీపీ రివర్స్ పాలనకే కాదు రివర్స్ బారోయింగ్ పద్ధతికి తెరలేపిందని మనోహర్ ఆరోపించారు. లక్షల కోట్లు అప్పు చేసిన వైసీపీ సర్కారు వాటికి లెక్కలు మాత్రం చూపడం లేదన్నారు.

జగన్ చెప్పినట్లే ఈ నాలుగేళ్లలో కేవలం లక్షా 72 వేల కోట్లే అప్పు తెచ్చామని చెబుతున్నా వాటిల్లో 91 వేల కోట్లకు లెక్కలే లేవు. ఈ లెక్కలు దాచడానికి రివర్స్ బారోయింగ్ అనే కొత్త పద్ధతిని తెచ్చిందని మనోహర్ ఆరోపించారు. లెక్కల్లో చూపని ఆ డబ్బంతా ఎటు పోయిందని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో ఈ విషయం బయట పడిందన్న ఆయన ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి పోయాయి.. ఎవరికి చేరాయన్నది ప్రభుత్వ  పెద్దలకి.. ఆర్థిక శాక అధికారులకు తెలుసన్నారు.

రివర్స్ బారోయింగ్ పేరు చెప్పి 2019-20లో రూ.17,391 కోట్లు, 2020-21లో రూ.30,764 కోట్లు, 2021-22లో రూ.33,843 కోట్లు, 2022-23లో రూ.9,250 కోట్లు వైసీపీ ప్రభుత్వం సేకరించిందని ఆయన ఆరోపించారు. ఈ నిధులపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ అప్పులు అన్నీ ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు, ఇతర పథకాలకు మళ్లించలేదని మరి ఎటు పోయిందని ప్రశ్నించారు. మరి దీనిపై వైసీపీ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: