జోరు పెంచిన ఎల్లో మీడియా.. జగన్‌ తట్టుకుంటారా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్లో మీడియా రెచ్చిపోతుంది. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.  తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించొచ్చు అనేది వారి ఉద్దేశం.  ఎలాగైనా చంద్రబాబు కు మేలు చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్ గనుల టెండర్లపై కూడా అడ్డగోలు రాతలు రాశారు.

అన్నమయ్య జిల్లా మంగంపేట గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్ ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నుల ఏ గ్రేడ్, 3 లక్షల టన్నుల బీ గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నలు సీ, డీ, డబ్ల్యూ(వేస్ట్) గ్రేడ్లుగా ఉంటుంది. సీ,డీ గ్రేడ్ ఖనిజానికి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ,డీ , డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్ నిల్వలు అమ్ముడుపోకుండా ఉండిపోయింది.

దాని విక్రయం, బెనిఫికేషన్ కోసం గతంలో పలుమార్లు టెండర్లు పిలిచినా.. సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ డబ్ల్యూ గ్రేడ్ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలు దారుల నుంచి సరైన స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి 20లక్షల చొప్పున ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు.

ఈ వాస్తవం తెలియకుండా ఎల్లో మీడియా అభూత కల్పనతో కోటి టన్నులకు ఒకేసారి టెండర్లు అనే అంశాన్ని హైలెట్ చేస్తోంది. సీ, డీ గ్రేడ్ రిజర్వు ధరను తగ్గించారని మరో ఆరోపణ చేసింది. వాస్తవానికి రిజర్వు ధర నిర్ణయానికి సబంధించిన జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. కానీ ఈ విషయాలను దాచిపెట్టి వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: