త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారా?

రాజకీయాల్లో ఆలోచన ఉండాలి కాని ఆవేశం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. అలా ఉంటే ప్రజలు శంకరిగిరి మాన్యాలకు పట్టించేస్తారు. కింది స్థాయి నుంచి ఎదిగిన నేతలకు ఈ విషయంపై స్పష్టత ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మాజీ మంత్రి కేటీఆర్ త్వరలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పార్టీని నడిపించాల్సిన నాయకుడు ఈ తరహా ప్రకటనలు చేస్తూ చులకన అయిపోతున్నారు అంటూ రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన ఓటమిని అంగీకరించింది లేదు. అలాగే కేటీఆర్ కూడా ప్రజలు కేసీఆర్ ను ఓడించలేదని.. అసంతృప్త ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించారని  కానీ ఇప్పుడు అదే ప్రజలు సీఎంగా కేసీఆర్ లేక బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

మళ్లీ సీఎంగా కేసీఆర్ ను చేసుకుందామని ప్రకటించేస్తున్నారు. అది ఎలా సాధ్యం అని అడిగే వారికి కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవడమే సమాధానం.  రాష్ట్రంలో మోజార్టీ కన్నా నలుగురు ఎమ్మెల్యేలు అదనంగా గెలిచారు. సంపూర్ణ ఆధిక్యంతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇప్పుడు దీనిని కూల్చేయాలని కేటీఆర్ చూస్తున్నారా.. అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారం కోల్పోయి రెండు నెలలు కావడం లేదు. అప్పుడే ప్రభుత్వాన్ని కూలగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు.

అంటే బీఆర్ఎస్ ఓటమి పాలైన ప్రజల తరఫున పోరాటం చేయదు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్లే ప్రమాద ముంది. ప్రస్తుతం కేటీఆర్ అధికారం లేదని మధనపడుతున్నారు అనే విషయం ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఉన్నపళంగా అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు. గెలిచిన 39 సీట్లతో అది సాధ్యమా అనే విషయం మరిచిపోతున్నారు.  గెలుపు కోసం వచ్చే ఐదేళ్లు కష్టపడితే ప్రయోజనం ఉంటుంది కానీ ఇలా సంచలన ప్రకటనలు చేసి షార్ట్ కట్స్ తో పవర్ లోకి రావాలనుకుంటే బీఆర్ఎస్ కే నష్టం అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: