ఆమె చేరిక రాయలసీమలో జనసేనకు కలిసొస్తుందా?
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. తాత ఆదికేశవుల నాయుడు మాదిరిగానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న చైతన్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె జనసేనలో చేరడం శుభపరిణామం అని పేర్కొన్నారు.
అయితే ఈమె గురించి ఇప్పుడు నెటిజన్లంతా తెగ వెతుకుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవుల నాయుడు కూతురు తేజస్విని కుమార్తె చైతన్య లలితాంబిక. ఆమె తాత ఆదికేశవుల నాయుడు లిక్కర్ కింగ్ కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకి అత్యంత సన్నిహితుడు. విజయ్ మాల్యా ఏ విమానం కొనుగోలు చేసినా సరే తిరుపతికి తీసుకువచ్చి తొలిసారి అతడిని ఎక్కించుకొని తీసుకువెళ్లేవారు. ఈ క్రమంలో ఆయనకు గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా ఉంది.
ఆ విజయ్ మాల్యా ఒత్తిడి మేరకే టీడీపీలో ఉన్న ఆదికేశవుల నాయుడు పార్లమెంట్ లో ఓ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేశారు. చివరి నిమిషంలో మళ్లీ వెనక్కి తగ్గాను అని ప్రకటించారు. కాకపోతే దీనికి ప్రతి ఫలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీడీడీ ఛైర్మన్ గా నియమించారు అనే ప్రచారం కూడా సాగింది. చిత్తూరు ఎంపీగా కూడా ఆయన పనిచేశారు. దీంతో చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం గట్టిగానే ఉంటుంది. తాజాగా ఆయన మనువరాలు జనసేనలో చేరడం ఆ పార్టీకి లాభం చేకూర్చేదే.