ఆ పది రాష్ట్రాలు సీబీఐని ఎందుకు రానివ్వట్లేదు?

దేశంలో అవినితీ నిరోధక శాఖ (సీబీఐ) ఒక స్వచ్చంద దర్యాప్తు సంస్థ. ఇది దేశంలో ఎక్కడైనా అవినీతికి సంబంధించి ఆరోపణలు రావడం, లేదా ఇతర అన్ని రకాల ఇన్విస్టిగేషన్ చేస్తుంది. అయితే గతంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ విచారణ చేయడానికి అనుమతిని ఇచ్చేవి. కానీ ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐను విచారణకు అనుమతించడం లేదు.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి, పాలకులు పాల్పడే దుర్మార్గాలను కింది స్థాయి నుంచి వెలికి తీయడంలో సీబీఐకి సాటి ఎవరూ రారు. కానీ ప్రస్తుతం దేశంలోని పది రాష్ట్రాలు సీబీఐ విచారణకు అనుమతి నిరాకరిస్తున్నాయి. వాటిలో తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు సీబీఐ విచారణను తమ రాష్ట్రాల్లో నిషేధం విధించాయి.

గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని విషయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐకి అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అందుకు చంద్రబాబు తన వ్యుహ చతురతను ఉపయోగించి చట్టాల్లో ఉన్న లోపాలను తనకు అనుకూలంగా మలుచుకుని సీబీఐ విచారణ చేయకుండా అడ్డుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణ జరగకుండా చేశారు. దీన్నే అదనుగా మలుచుకుని మిగతా పది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సీబీఐను అనుమతించడం లేదు.

అయితే ఆ పది రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి వారు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా సీబీఐ రాకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐ అడ్డుకుంటున్న విధానాన్ని తీసేసేలా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విచారణ చేసేలా చట్టం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి అమిత్ షా వ్యుహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: