కేసీఆర్.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి?
ఎందుకంటే 2018 ఎన్నికల సమయంలో కూడా ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి దాదాపు 90శాతం సీట్లు ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుచుకుంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క్ సీటుకే పరిమితమైన బీజేపీ ఎంపీ ఎన్నికలకు వచ్చే సరికి 4 స్థానాలు గెలుచుకుంది.
అంటే లోక్ సభ ఎన్నికలపై జాతీయ పార్టీల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇప్పటికీ ప్రధాని మోదీ ప్రజాధారణకు తిరుగులేదు. మరోసారి ఆయనే ప్రధాని గా చూడాలనుకునేవారు తప్పనిసరిగా బీజేపీకే ఓటు వేస్తారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు అతి పెద్ద సమస్యల్లా బీఆర్ఎస్ పార్టీకే.
ఎందుకంటే ఆ పార్టీ అటు ఎన్డీయే కూటమిలోను, ఇటు ఇండియా కూటమిలోను లేదు. ప్రస్తుతం తృతీయ ఫ్రంట్ అసలు లేనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెప్పి కేసీఆర్ లోక్ సభ ఎన్నికలకు వెళ్తారనేది ఆసక్తికర అంశం. బీజేపీకి ఓటు వేయోద్దంటే కాంగ్రెస్ తో పొత్తు అంటారు. కాంగ్రెస్ కు వద్దంటే ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. కాకపోతే ఈ సారి ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ గతంలో కన్నా హస్తం పార్టీ సీట్లు ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంది.