జగన్ కేసుల విచారణ.. ఇంత ఆలస్యం ఎందుకో?

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న వారిపై కేసుల విచారణలో జాప్యం నెలకొనడంతో సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులు మన రాజకీయ ప్రజాస్వామ్యంపై తీవ్ర పరిణామాలు చూపుతాయని పేర్కొంది. అయితే రాజకీయ నాయకులు కేసుల విషయానికొస్తే కొన్ని వెంటనే విచారణకు వస్తాయి. మరికొన్ని ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటాయి. కొన్ని సంస్థలు, వ్యక్తులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తాయి. ఇవి అన్నీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాల సఖ్యత మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే కేంద్రలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో జగన్ భాగస్వామ్యం కాకపోయినా.. ఎన్డీయే కూటమి ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు మద్దతిస్తుంటారు. రాష్ట్రంలో కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ విమర్శిస్తుంటారు తప్ప ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నడ్డాలపై ఎలాంటి విమర్శలు చేయరు.

అమిత్ షా, నడ్డాలు ఏపీ పర్యటన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అత్యంత అవినీతి పరుడు అని ఆరోపిస్తే జగన్ దానిని కనీసం తిప్పికొట్టలేదు. మరో వ్యవహారం ఏదైనా అయితే వైసీపీ మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తారు. కానీ కేంద్రమంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులు విషయానికొస్తే మాత్రం మాట్లాడరు. ఒకరిద్దరూ మంత్రులు తిప్పికొట్టినా అవి నామమాత్రంగానే ఉంటాయి.

వైజాగ్ నగరాన్ని విద్రోహ శక్తుల అడ్డాగా మారుస్తున్నాయని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీనిపై వైజాగ్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట కూడా అనలేదు. అదే తెలంగాణ మంత్రులు, టీడీపీ నేతలు అంటే సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడతారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే అతనిపై ఉన్న కేసులను త్వరతగతిన పూర్తి చేయడం వల్ల నేర రాజకీయాల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. కానీ ఎల్లకాలం కేసులు కోర్టులో పెండింగ్ ఉండటం  ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: