చంద్రబాబు వెరీ లక్కీ.. ఎందుకంటే?

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి చేస్తే జైలు జీవితం తప్పదని మనీశ్ సిసోడియా లిక్కర్ స్కాం కేసు చూస్తే తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అయినా మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేస్తున్నారు. అయితే  అరవింద్ కేజ్రీవాల్ చాలా నిజాయితీ పరుడు అని చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు. కానీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే మాత్రం ఏమీ తెలియదని చెప్పడం ఆయనకే చెల్లింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా రోజులుగా మనీశ్ సిసోడియా జైలు జీవితం గడుపుతున్నాడు. ఇలాంటి సందర్భంలో ఆయన కేసు సుప్రీం కోర్టులో బెయిల్ పై విచారణ జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమ్ అద్మీ పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది.

338 కోట్ల నగదు బదిలీలపై అనుమానాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. అయితే వీటికి సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు ఈడీ అధికారులు సమర్పించారని పేర్కొంది. ఇప్పటికే విచారణ మొదలైందని ఇప్పుడు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎన్వీఎస్ భట్టి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తీర్పు వెలువరించింది. విచారణను వేగవంతం చేయాలని సూచించింది. దర్యాప్తు మందకొడిగా సాగితే తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని మనీశ్ సిసోడియా తరఫున న్యాయవాదులకు తెలియజేసింది.

కీలకమైన విషయం ఏమిటంటే రెండున్నర వేల కోట్లు లిక్కర్ స్కాంలో దాదాపు 100 నుంచి 300 కోట్ల వరకు అవినీతి జరిగిందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జరిగిన అవినీతిలో కూడా దాదాపు 337 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబుకు బెయిల్ రావడం, మనీశ్ సిసోడియాకు బెయిల్ దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

CBN

సంబంధిత వార్తలు: