పవన్.. ఆ విషయంలో ప్రజలను నమ్మించగలరా?
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రలు ఎవరూ ఉండరు. కమ్యూనిస్టులతో కలిసినా.. బీజేపీతో కలిసినా.. టీడీపీతో పొత్తులు పెట్టుకున్నా అది ప్రజలకు మేలు చేసేందుకే. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. నేను ఎవరికీ, ఏపార్టీకి వ్యతిరేకం కాదు. పార్టీ ప్రతినిధులు పార్టీ కోసమే మాట్లాడాలి అని ఆ పార్టీ సమావేంలో తెలిపారు.
అయితే పార్టీ అధికార ప్రతినిధుల కన్నా ముందు పవన్ కల్యాణ్ ప్రజలను కన్విన్స్ చేయాలి. ఎందుకంటే 2014-19 లో టీడీపీ పాలన బాగుంటే ఆ పార్టీకి 23 స్థానాలే ఎందుకు వచ్చాయి. ఒకవేళ జగన్ పాలన సరిగ్గా చేయకపోతే ఆయన్ను ఇలానే ఓడిస్తారు కదా. టీడీపీ పాలన బాగుంది అని చెప్పాలా వైసీపీ పనితీరు బాగా లేదని ప్రచారం చేయాలా.. అవినీతి ని సహించను. అవినీతి పరుడు కాబట్టే జగన్ ను వ్యతిరేకిస్తున్నానని పవన్ చెప్పగలరా అన్నది ఆలోచించాలి.
అదే నిజమైతే ఇప్పుడు చంద్రబాబు అవినీతి కేసులోనే అరెస్టయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకి ఎలా మద్దతిస్తారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను వ్యతిరేకించాలి. 2019 సమయంలో చంద్రబాబు పై నేను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి పవన్ వారందరనీ కన్విన్స్ చేయాలి. పార్టీ అధికార ప్రతినిధులు వీటిని కన్విన్స్ చేయలేరు. ప్రజలు వారిని చూసి ఓటు వేయరు. పార్టీ అధినేతను మాత్రమే చూస్తారు.