ఇజ్రాయెల్‌ను భయపెడుతున్న గాజా సొరంగాలు?

ముంబయి గురించి మనం అందరూ వినే ఉంటాం. అక్కడ ధారావిలో 10 గజాల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు కుటుంబాలు నివాసం ఉంటాయి. దాదాపు గాజా పరిస్థితి కూడా అంతే. ఇక్కడ 5 గజాల స్థలంలో రెండు కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. అంత జనసాంధ్రత కలిగిన ప్రాంతం అది. అలాంటి చోట్ల హమాస్ తీవ్రవాదులు ఎలా తిరుగుతున్నారు అంటే…ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూ గర్భ సొరంగాల విస్తారమైన నెట్ వర్క్ హమాస్ కు పెట్టని కోటగా మారింది.


ఇజ్రాయెల్ లో నర మేధం సృష్టించిన హమాస్ తీవ్రవాదులు సరిహద్దులు దాటేందుకు సముద్ర, ఆకాశ మార్గాలతో పాటు ఈ సొరంగ మార్గాలను వాడుకున్నట్లు తెలిసింది. ఈ టన్నెల్ నెట్ వర్క్ ఎలా.. ఎక్కడుంది ఇజ్రాయెల్ కు అంతుచిక్కడం లేదు. పైకి కనిపించే గాజా ఒకటైతే మరొక గాజా భూ  ఉపరితలం కింద ఉంది. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామాగ్రి, నెట్ వర్క్ ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ బందీలను కూడా అండర్ గ్రౌండ్ లోనే దాచినట్లు తెలుస్తోంది. భూ గర్భంలో బారియర్లను ఏర్పాటు చేసేందుకు రూ.7500 కోట్లకు పైగా ఖర్చు చేసింది.


ఎల్బిట్ సిస్టం, రఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ బాధ్యతలు అప్పగించింది. ఐరన్ వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవి సాంకేతికంగా అభివృద్ధి పరిచాయి. దీని మధ్య రెండు పొరలు ఉన్నాయి. ఒకటి పౌరులది కాగా.. రెండోది హమాస్ ది. ఈ రెండోది ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా యత్నిస్తోంది. వీటిలో వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్తు తదితర సౌకర్యాలు సైతం సమకూర్చింది. కొన్ని టన్నెళ్లయితే 35 కిలో మీటర్ల లోతు కూడా ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గతంలో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: