ఇజ్రాయెల్‌ యుద్ధం.. ప్రపంచానికి వ్యాపిస్తోందా?

ప్రస్తుతం ప్రపంచం అంతా ఇజ్రాయిల్ పాలస్తీనా గురించే మాట్లాడుకుంటారు. ఇజ్రాయిల్ లో హమాస్ ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. ఈ విషయంపై ఎంత చెప్పుకున్న తక్కువే. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఇష్టారీతిన వారిని చంపేశారు. దొరికిన వారందరినీ కిడ్నాప్ చేశారు. మొత్తం ఇజ్రాయిల్ వీధులన్నీ రక్తసిక్తమయిపోయాయి.

అయితే ఇంతటి దారుణాలను తెగబడ్డ సమయంలో ఇజ్రాయిల్ రక్తమోడుతుంటే మరో వైపు పాలస్తీనా పౌరులు వివిధ దేశాల్లో ఆ దేశ జెండా పట్టుకుని ర్యాలీలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. బ్రిటన్, జర్మనీ, యూరప్ దేశాల్లో పాలస్తీనా వాసులు ర్యాలీలు చేయడం వల్ల హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించారు. ఇలా వ్యవహరించడం వల్ల అనేక రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పాలస్తీనాలో ఉగ్రవాదులకు ప్రజలు మద్దతిస్తున్నారా? లేక మద్దతిచ్చినా వారంతా ఉగ్రవాదులేనా అని చర్చకు దారి తీస్తుంది.

సౌదీ అరేబియా, ఇరాన్, గల్ప్ దేశాలు, ఈజిప్టు లాంటి అనేక చోట్ల ఇస్లామిక్ సంప్రదాయం పేరుతో చాలా మంది అనేక రకాల గ్రూపులుగా ఏర్పడి తీవ్రవాదం వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా ఆయా దేశాల్లో ఉగ్రవాదులు చేపడుతున్న దాడుల వల్ల ఎంతో మంది  అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పాలస్తీనాలోని గాజా నుంచే కాక లెబనాన్, సిరియా లాంటి ప్రాంతాల నుంచి హిబ్జుల్లా, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నారు. దీన్ని ఇజ్రాయిల్ సైన్యం సమర్థమంతంగా తిప్పి కొడుతుంది.

హిబ్జల్లా, హమాస్, ఐసిస్, తాలిబాన్లు, ఆల్ ఖైదా, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల పేర్లతో ఉగ్రవాద సంస్థలు ఆయా దేశాల్లో రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వారు అనుకున్న లక్ష్యం ఏమో కానీ ఆయా దేశాల్లో శాంతి కరువవుతోంది. తద్వారా అక్కడ ఉండే ప్రజలకు సమస్యలు ఎదురై తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ప్రస్తుతం గాజాలో కూడా ఇదే దీనమైన పరిస్థితి ఎదురవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: