హమాస్‌ తరహాలో ఇండియాకూ ఘోర ప్రమాదం?

దేశ దేశానికి ఓ విధానం ఉంటుంది. శాంతి  భద్రతల విషయంలో అన్నింటిని ఒకతాటిపైకి తీసుకొచ్చి దేశాల మధ్య సయోధ్యను కుదర్చడమే ఐక్యరాజ్య సమితి, నాటో దేశాల పని. తాను తీసుకున్న గోతిలో తానే పడతారు అనేది సామెత.  తీవ్రవాదాన్ని సమర్థించే దేశాలు అదే తీవ్రవాద ఉచ్చులో చిక్కుకుంటాయి అనడానికి ఉదాహరణ ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు.

హమాస్ తీవ్రవాదులు చేసే దుష్కృత్యాలకు ఇరాన్, హిజ్బుల్లా దేశాల అండదండులు ఉన్నాయి.  రష్యాపై ప్రతీకారం కోసం ఒకప్పుడు అఫ్గానిస్థాన్ లోని తాలిబన్లను, పాకిస్థాన్ లోని తీవ్రవాదులను  పెంచిపోషించింది అమెరికా, యూరప్ దేశాలు. దాని పర్యావసారం పారిస్ లోని పేలుళ్ల దగ్గర నుంచి అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ల వరకు కొనసాగాయి. తమను వాడుకున్నారనే భావనతో తీవ్రవాదులు, తాలిబాన్లు వీరిపై ప్రతి దాడులకు పాల్పడ్డారు.  

ఆ తర్వాత అమెరికా తమ సైన్యాన్ని దింపి అఫ్గాన్ లోని తాలిబన్లను అణచివేసింది.  బిన్ లాడెన్ ను మట్టు బెట్టింది. ఇలా తాము పెంచి పోషించిన తీవ్రవాదులు, తాలిబన్లే తమకే ఎదురు తిరుగుతారని ఊహించలేకపోయింది. ఇప్పుడేమో ఉగ్రవాద సంస్థలకు సమర్థించం అని ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతున్నారు.  

కానీ మరోవైపు ఖలీస్థానీ తీవ్రవాదులకు వత్తాసు పలుకుతున్నారు. భారత్ను ముక్కలు చేస్తాం.. పంజాబ్ ను విడగొడతాం అని చెబుతున్న ఖలీస్థానీ నాయకుడు పన్నూ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఎక్కువగా తిరుగుతున్నారు. కెనడాలో అయితే నిజ్జర్ లా తనను కూడా హతమారుస్తారని భయపడుతున్నాడు. వీరంతా భారత్ వ్యతిరేకులైన ఖలీస్థానీ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతున్నారు. పన్ను ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ హమాస్ తరహాలోనే మేము భారత్ పై దాడి చేస్తాం అని పేర్కొన్నాడు.

గతంలో జీ20 సదస్సు ను అడ్డుకుంటామన్నాడు.  తాజాగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలను జరగనివ్వను అని బహిరంగంగా ప్రకటిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు  చేస్తున్నాడు. భావ ప్రకటన పేరుతో ఇతను చేసే ఉద్దేశ పూర్వక ప్రసంగాలను అడ్డుకోకపోతే ఆయా దేశాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: