చంద్రబాబు లాయర్ల ఫీజులు ఎంతో తెలుసా?

ఓ సినిమా హీరో ఎంత రెమున్యేషన్ తీసుకుంటాడు. క్రికెటర్  కి మ్యాచ్ ఆడితే ఎన్ని కోట్లు వస్తాయో.. రాజకీయ నాయకుడి సంపాదన ఎంత ఉంటుంది. ఇలా సాధారణంగా ఎవరెంత తీసుకుంటారో అనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పుడు తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరఫున వాదించే లాయర్లు ఎంత తీసుకుంటారు అని ప్రశ్న అందరినీ తొలుస్తుంది.


నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున దాదాపు 11 మంది లాయర్లు తమ వాదనలు వినిపించారు. వీరంతా రూ.20 లక్షల నుంచి రూ. కోటి ఫీజు తీసుకుంటారు.  వీరిలో ముగ్గురు ప్రధానమైనవారు. వీరిని న్యాయ భాషలో చెప్పాలంటే న్యాయ త్రయం అంటారు. వారు ఎవరెవరు అంటే హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూధ్రా, అభిషేక్ మను సింఘ్వీ. వీరందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడంలో లోకేశ్ సఫలీకృతుడయ్యాడు.  


ఇంతమంది న్యాయబృందం తమ వాదనలు వినిపిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ రద్దవుతుందని లోకేశ్తో పాటు ఇతర నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ బెంచ్ మార్క్ తీర్పు రానుంది. ఆర్థిక నేరం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. ఆర్థిక నేరగాళ్లు బయట సమాజంలో తిరగకూడదు అనే పాయింట్ ని జగన్ కేసు సందర్భంగా వినిపించారు. ఆ కేసులోనే చిదంబరాన్ని అరెస్టు చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని ఏపీ ప్రభుత్వ లాయర్లు తీసుకువస్తే కేసు మరో మలుపు తిరుగుతుంది. కానీ జగన్ పరువు పోతోంది అని వాళ్లు ఆలోచిస్తున్నారు.


ఆ కేసును ఉదహరిస్తే చిదంబరాన్ని, కనిమొళిని, జగన్ ను అరెస్టు చేసినప్పుడు చంద్రబాబుని ఎందుకు అరెస్టు చేయరు. కానీ దీనిని వాళ్లు ఉటంకించరు. ఇదే చంద్రబాబు తరఫు లాయర్లకు పెట్టుబడి. ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్పి వీరు యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసులను ఉదహరిస్తున్నారు. సుప్రీం కోర్టు కూడా 17 ఏ వాదనలు మాత్రమే వింటామని సెలవిచ్చింది. చూద్దాం ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: