జగన్ కో న్యాయం.. బాబుకో న్యాయమా?

మీడియా అంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలపాల్సిందే అన్నట్టుంది నేటి పరిస్థితి. తాము చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియాలంటే రాజకీయ పార్టీలకు మీడియా తప్పనిసరి.  అందుకనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు ఓ మీడియా ఛానల్‌ను  ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు ఏపీ విషయానికొస్తే వైసీపీకి సాక్షి ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నమస్తే తెలంగాణ వార్తలు రాస్తూ ఉంటుంది. ఈ రెండు పత్రికలు ఆయా పార్టీల కార్యక్రమాలు, పార్టీ ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

ఎల్లో మీడియాగా పేరున్న రెండు పత్రికల విషయానికొస్తే వీటిపై ప్రజలకు కొంత నమ్మకం ఉంది. టీడీపీకి అనుకూల వార్తలు రాసినా ఇతర అంశాల్లో కొంత సంయమనం పాటిస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కుంభకోణాలు, అవినీతి  జరిగాయి అని రాస్తున్నారు. టీడీపీ హయాంలో సాక్షి ఈ విధంగానే వ్యవహరించింది అని ఈ పత్రికల్లో రాశారు.  ఆ ప్రకారం సాక్షికి ఇతర పత్రికలకు తేడా ఏంటి అని పలువురు వక్తలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు రాగానే రఫెల్ కుంభకోణం అని ఎల్లో మీడియా  రోజూ వరుస కథనాలు ప్రచురించాయి. ఇప్పటికీ అదానీకి దోచిపెడుతున్న మోదీ  అని రాస్తున్నాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదు. ఆధారాలు ఉన్నాయి అని వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. రఫెల్ విషయంలోను విమానాలు వచ్చాయి కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ విషయంలోను ఆరోపణలతోనే అరెస్ట్ చేశారు. వారికి  ఓ న్యాయం చంద్రబాబుకు ఓ న్యాయమా అని చర్చించుకుంటున్నారు.  

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలను ఎండగడతాం అని సంపాదకీయాలు రాసిన ఈ పత్రికలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదే ధోరణి కొనసాగితే ప్రజలు ఈ పత్రికలపై విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: