జైల్లో బాబు.. లోకేశ్‌కు ఇదే మంచి ఛాన్స్?

రాజకీయ సంక్షోభంలో సవాళ్లను ఎదుర్కొనే వారే పరిపూర్ణ రాజకీయ నేతగా అవతరిస్తాడు.  పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఆచూతుచి మాట్లాడాలి. గతంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పార్టీలో అసమ్మతి తలెత్తినప్పుడు  నారా చంద్రబాబు నాయుడు అత్యంత జాగురతతో వ్యవహరించి అటు పార్టీని ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసి విజయవంతం అయ్యారు.

ప్రస్తుతం అలాంటి  పరిస్థితి పార్టీ కి లేకున్నా నాయకత్వ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే లోకేష్ తనను నిరూపించుకోవాలి. చంద్రబాబు అరెస్టు విషయంలో పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పవచ్చు. దీనిని తెదేపా రాజకీయంగా ఉపయోగించుకోవాలి.  ఇది అక్రమ అరెస్టు అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళి సానుభూతి పొందాలి.  పార్టీ శ్రేణులు ఎప్పుడు అధినాయకత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ సందర్భంలోనే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేయాలి. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వ్యవహరించి ఇటు పార్టీని అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలి. అంతకు ముందు ఎన్ని ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇచ్చిన చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అనే అంశం పైనే అతని రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం అటు కార్యకర్తల్లోనూ, ఇటు పార్టీ నాయకుల్లోనూ భరోసా నిoపేలా ఉండాలి.  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడాలి. బందులు, రాస్తారోకోలు ఒక ఎత్తు అయితే సానుభూతి పొందేలా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం మరో ఎత్తు.  తెదేపాకు మద్దతుగా జనసేన, వామపక్ష పార్టీలు నిలిచాయి. వారితో కలిసి  అరెస్టు అక్రమం అని జనాల్లోకి తెసుకెల్లాలి . పార్టీ ని నడిపించే అధినాయకుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను లోకేష్ తీసుకొని పార్టీలో నాయకత్వ సమస్య తలెత్తకుండా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: