ఆ పథకం సరిగ్గా అమలైతే జగన్‌కు ఓట్ల పంటే?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మరో పథకం ఫ్యామిలీ డాక్టర్. నిజం చెప్పాలంటే  ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అంటే ఈ పథకానికి సగం వరకు నిధులు లేదా 60% వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉంటుంది.  

ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఈ పథకం అనేది ఒక రకంగా చాలా మంచి ఆలోచనే. దేశానికి పట్టు కొమ్మలైనటువంటి పల్లెటూర్ల నుండి చాలా మంది పేదల పిల్లలు తమ చదువుల కోసం, ఉద్యోగాల కోసం  అని నగరాలకు వెళ్లిపోవడం జరుగుతుంది. దాంతో పల్లెటూర్ల లోనూ, మారుమూల గ్రామాల్లోనూ ఉండే పేదలు తమని చూడడానికి కన్నబిడ్డలో, మనవళ్ళో లేక ఒంటరి వారైపోతున్న పరిస్థితి.

ఇలాంటి పరిస్థితిలో  ఆ పెద్దలు అనారోగ్యం పాలైతే కనుక వాళ్ల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. వాళ్లని చూసే వాళ్ళు లేక  దగ్గర లోనో, దూరంలోనూ ఉండే ఏ హాస్పటల్ కో తీసుకెళ్లే వాళ్ళు లేక నానా అవస్థలు పడిపోతుంటారు వాళ్ళు. అయితే ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యాచరణ ద్వారా అలాంటి పేదలకు, వయోవృద్ధులకు ఎంతో మేలు జరుగుతుంది.

రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళ ఆరోగ్యం చెక్ చేయడం ద్వారా వాళ్లకి అనారోగ్యంలో కూడా శ్రమ పడుతూ హాస్పటల్ కి వెళ్లాల్సిన పని ఉండదు. అంతే కాకుండా ఈ రెగ్యులర్ చెకప్ వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వాళ్లకి తెలియజేయడానికి కుదురుతుంది. అంతే కాకుండా వాళ్లు అనారోగ్యం పేరుతో హాస్పిటల్ కి చేసే ఖర్చు కూడా కలిసి వస్తుంది. అయితే ఈ వైద్య సేవలు కూడా ఉచితం కావడంతో నిరుపేదలకు కూడా దీని వల్ల కష్టాలు తీరినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: