నిజమా? జగన్‌ వల్ల ఆంధ్రా ఆదాయం పెరిగిందా?

ఆంధ్రలో గత నాలుగేళ్ల నుంచి సర్వ నాశనం అయిపోయిందని కొంత మంది టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏదో జరిగిపోతుందని చెప్పడంతో చాలా మంది దీనికి ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల వారికి ఇక్కడి పరిస్థితులు తెలియక నిజంగానే ఆంధ్ర నష్టాల్లో కూరుకుపోయిందని అనుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలుసుకోవాలి.

నిజంగానే తెలంగాణ తలసరి ఆదాయంలో మెరుగ్గా ఉంది. కానీ దానికి ఆంధ్రప్రదేశ్ తో విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయి రాజధాని హైదరాబాద్ ఉంది. కాబట్టి ఇది సాధ్యమే. ఒక వేళ హైదరాబాద్ లేకపోతే తెలంగాణ పరిస్థితి ఏమిటి? మిగతా జిల్లాలో ఆదాయం పావు వంతు కూడా రాదు. కానీ దీన్ని మీడియా పెద్దగా ఫోకస్ చేయదు.

చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేలుగా ఉంది. 2022-23 సంవత్సరం జగన్ సర్కారు హయాంలో 2 లక్షల 19 వేల 518 గా ఉంది. అయితే జీఎస్టీ పెరిగింది. జీడీపీ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన డాటా ప్రకారం.. నాలుగేళ్ల లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 40 శాతం మెరుగైందని పేర్కొంది.

నాలుగేళ్ల కిందట నాలుగు లక్షల యాభై నాలుగు వేలు ఉన్న తలసరి ఆదాయం 2023 వచ్చే సరికి 2 లక్షల 19 వేలకు పెరగడం శుభసూచకమే. కానీ దీన్ని ఎక్కడ కూడా ఎల్లో మీడియా ప్రచురించడం లేదు. గోవాలో 2017 లోనే 4 లక్షలపైనే తలసరి ఆదాయం ఉంది. ఇలా 2023 వరకు దాదాపు 4 లక్షల తలసరి ఆదాయంతో టాప్ గా ఉంది. తలసరి ఆదాయంలో రూ. 2 లక్షలు దాటిన వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం అభినందించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: