కమ్మ, రెడ్డి కాదు.. రాహుల్ మెచ్చిన రఘువీరారెడ్డి?
చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంతే కాకుండా బిజెపి కూడా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీనే. మరి బీసీలలో రఘువీరారెడ్డికి మాత్రమే పిసిసి చీఫ్ పొజిషన్ ఇచ్చారా అంటే గతంలో వి హనుమంతరావు కూడా ఇదేవిధంగా ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రఘు వీరారెడ్డి కి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది.
అసలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరారెడ్డికి సిడబ్ల్యూసి పదవిని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆయన కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హడావుడి కొంతైన ఉంది గాని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హడావుడి ఏమీ లేదు. అయినా కూడా రఘువీరారెడ్డికి కాంగ్రెస్ వర్గంలో అవకాశం ఇవ్వడం ప్రత్యేకత నిలుపుకుంది.
గతంలో కేకేకు ఇలాంటి అదృష్టం దక్కిందని అంటున్నారు. దీంట్లో తెలంగాణ నుండి దామోదర రాజనర్సింహాని శాశ్వత ఆహ్వానితుడిగా, ఏఐసీసీ కార్యదర్శి మున్షిం చందును ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశాన్ని కల్పించారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యుసి లో పదవిని ఆశించారు చింతా మోహన్. ఈయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కూడా ఉండేవారు కానీ ఆయనకు సిడబ్ల్యుసిలో చోటు దక్కలేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే క్రియాశీలకంగా లేనటువంటి రఘువీరాకి ఆ అవకాశం దక్కింది.