రిషికొండపై భవనం.. జగన్‌ మాయ చేస్తున్నాడా?

విశాఖ పట్నం అభివృద్దికి మరో ముందడుగు వేస్తున్నారని సాక్షి దినపత్రికలో ఇటీవల ఓ కథనం వచ్చింది. టూరిజం డెవలప్ మెంట్ లో భాగంగానే కాకుండా రిషి కొండ పైన ముఖ్యమంత్రి ఉండాలని నిర్ణయించుకున్నారు. టూరిజం స్పాట్ ను అక్కడ పగలగొట్టించి దానిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కట్టిస్తున్నారు. అయితే పక్కన సముద్రం, ఇటు పక్కన నగరంతో ఎంతో ఆహ్లదంగా అందంగా రిచ్ గా కనిపించే అవకాశం ఉంది. అది కొండపైన కావడంతో అందరి కంటే పై ఎత్తులో ఉండటం హుందాగా ఉంటుందని సీఎం జగన్ అనుకుంటున్నారు.

అయితే అంత లగ్జరీ బిల్డింగ్‌ అవసరమా అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అదే చంద్రబాబు నాయుడు అక్కడ అలాంటి బిల్డింగ్ కట్టించి ఉంటే చంద్రబాబు విజన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు పెద్ద పెద్ద కథనాలతో పత్రికల్లో ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ అలాంటి రాజభవనం లాంటి సీఎం కార్యాలయం కట్టిస్తున్నాడు కాబట్టి అది ప్రతిపక్షాలకు నచ్చడం లేదు.

ఇక్కడ విషయం ఏంటంటే సీఎం కార్యాలయం కడుతున్నట్టు దాచి పెట్టారు. అయితే దీనిపై కోర్టులో కేసు వేశారు. అయితే రిషి కొండ పైన ఉన్న బిల్డింగ్ టూరిజం డెవలప్ మెంట్ శాఖ కింద ఉంది. ఇది సీఎం క్యాంపు కార్యాలయం కట్టుకోవడానికి ఇస్తున్నట్లు ఒప్పుకుంటేనే అక్కడ దాని నిర్మాణం సాగిపోతుంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అక్కడ ఉంది వైజాగ్ రాజధానిగా కొనసాగుతుందని నిరూపించుకోవచ్చని జగన్ ఆరాటపడుతున్నారు.

అయితే టూరిజం దెబ్బతీస్తున్నారని కొంతమంది కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కోసం 20  ఎకరాలు స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు 16 ఎకరాలు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. టూరిజం శాఖకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిషికొండ లో బిల్డింగ్ పోయినందుకు తిరిగి అంతకు మించి టూరిజాన్ని డెవలప్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: