టార్గెట్ పిన్మెల్లి : ఓట‌మి లేని నేత‌ను రిగ్గింగ్‌తో ఓడించ‌డ‌మే బాబోరి టార్గెట్టా ?

Reddy P Rajasekhar
ఏపీ రాజకీయాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పిన్నెల్లి ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1996 సంవత్సరంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టిన పిన్నెల్లి 2004 నుంచి 2009 వరకు వెల్దుర్తి జడ్పీటీసీగా పని చేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పై 9785 ఓట్ల మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు.
 
వైఎస్సార్ మరణం తర్వాత పిన్నెల్లి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ తరపున గెలిచిన ఆయనకు 2014, 2019 ఎన్నికల్లో సైతం అనుకూల ఫలితాలు వచ్చాయి. 2019 సంవత్సరంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను విప్ గా నియమించడం జరిగింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉండగా ఆయన ఈవీఎంను ధ్వంసం చేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
అసలు ఓటమి తెలియని నేతగా గుర్తింపును సొంతం చేసుకున్న పిన్నెల్లిని రిగ్గింగ్ తో ఓడించాలని బాబు, టీడీపీ నేతలు మాచర్లలో ఏమైనా కుట్ర చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పల్నాడు ప్రజలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి గెలిచి వైసీపీ అధికారంలోకి ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అలాంటి పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కావాలనే టార్గెట్ చేశారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పిన్నెల్లిని ఓడించడం అసాధ్యమని భావించి టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపి పిన్నెల్లిని రెచ్చగొట్టి ఈ విధంగా చేయించారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పిన్నెల్లి అజ్ఞాతం వీడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: