ఏపీ: కూటమి గెలిస్తే బాబు జనసేనానికి హోం మినిస్టర్ కట్టబెడతాడా?

Suma Kallamadi
ఎన్నికల రిజల్స్ట్స్ కి ఇంకా 11 రోజులు గడువు మాత్రమే మిగిలి వుంది. ఈలోపు ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. మరలా అధికారంలోకి వస్తామని వైస్సార్సీపీ స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఈసారి అధికారం మాదేనంటూ టీడీపీ కూటమి ధీమాని వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికి ఇస్తారు? అన్న అంశం పైన చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టేటువంటి ఉత్సాహ పరులు కొంతమంది ఆల్రెడీ పాతిక మంది మంత్రులను ప్రకటించేసి శాఖలను కేటాయించడం కొసమెరుపు. అయితే చాలా మంది విచిత్రంగా హోం శాఖ మీదనే ఫోకస్ పెట్టడం గమనించవచ్చు.
దానికి కారణం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి తరువాత అంతటి పవర్ ఫుల్ శాఖ అదే. పోలీస్ మంత్రిగా చట్టాన్ని కాపాడే కీలకమైన బాధ్యతలతో బరువు పరువు ఎక్కువ ఈ శాఖకే ఉంటాయన్న సంగతి తెలిసినదే. దానికి తోడు ప్రతి పక్షాలను మెడలు వంచాలన్న కూడా ఆ శాఖకే కుదురుతుంది. అలాంటి ఈ కీలక శాఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని అంతా కోరుతున్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీకి ఊపిరి పోశాడన్న సంగతి అందరికీ తెలిసినదే. అందుకనే అయన అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు, ప్రజలు కావచ్చు... హోమ్ శాఖను మాత్రం పవన్ కే కేటాయించాలని ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కాపు నేత మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య పవన్ కి డిప్యూటీ సీఎంతో పాటు ఈ కీలక శాఖ ఇవ్వాలని ఆల్రెడీ ఓ వీడియో రూపంలో డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంత జరుగుతున్న దాని మీద మాత్రం టీడీపీ ఇంతవరకు రెస్పాండ్ కాకపోవడం కొసమెరుపు. అయితే జూన్ 4న ఫలితాలు తరువాత టీడీపీ గెలిస్తే మాత్రం అపుడైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని అంటున్నారు ఆయన అభిమానులు. లేదంటే జనసైన్యం ఆగ్రహానికి బాబు గురవ్వక తప్పదని శాపనార్ధాలు పెడుతున్నారు. అవును, పవన్ కళ్యాణ్ జనసేన నేతగా బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉన్న నాయకుడిగా ఆయన హోదాను కూడా దృష్టిలో పెట్టుకొని హోం శాఖ ఆయనకే ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. మరి బాబుగోరు ఏం చేస్తారో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: