బాబోయ్ బ్ర‌హ్మారెడ్డి: మాచ‌ర్ల ర‌చ్చ‌లో బ్ర‌హ్మారెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఆయ‌న‌పై కేసులెన్ని...?

FARMANULLA SHAIK
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాట్ టాపిక్‌గా మారారు.బ్రహ్మారెడ్డి మాచర్లలో మళ్లీ ఎందుకు అడుగుపెట్టారనే చర్చ కొనసాగుతుంది.పల్నాడు జిల్లాల్లోని మాచర్ల నియోజకవర్గంలో 2004లో ప్రారంభమైన పిన్నెల్లి కుటుంబం హవా ఇప్పటికి కొనసాగుతునేవుంది.2004లో లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో దిగి గెలుపొందారు.ఆయన తర్వాత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రాజకీయం రంగ ప్రవేశం చేసి 2009,2012 లో విజయం సాధించారు.గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలుపొందారు.అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని ఢీ కొట్టాలంటే టీడీపీ అధినేతకు ఒక సవాల్ గా మారింది.కనుక ఆయనకు ధీటుగా పనిచేసే నాయకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టి చివరకు బ్రహ్మారెడ్డిని బరిలోకి దించింది.ఆయన్ని మాచర్ల టీడీపీ పార్టీ ఇంఛార్జ్‌గా నియమించారు అధినేత చంద్రబాబునాయుడు. బ్రహ్మారెడ్డిది మాచర్ల నియోజకవర్గనికి చెందిన వెల్దుర్ది వాసి. ఆయన తండ్రి నాగిరెడ్డి, అలాగే అమ్మ దుర్గాంబ కూడా గత ఎన్నికల్లో గెలిచినవాళ్లే.ఆ తరువాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు.
అప్పటి ఉమ్మడి ఏపీలో ఏడు ఫ్యాక్షన్ హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారన్న సంగతి అక్కడి లోకల్ ప్రజల టాక్.తన సొంత బాబాయి హనిమిరెడ్డి హత్య కేసులో ఆయనే మెయిన్ పాత్ర పోషించారని ప్రజలంటుంటారు.అయితే 2001 మార్చి 10న ఆ హత్య కేసు వాయిదా నిమిత్తం బ్రహ్మారెడ్డి కి బాబాయ్ అయినా  సాంబిరెడ్డి తన వర్గం వాళ్లతో నరసరావుపేట కోర్టుకి వెళ్లి వస్తుండగా బ్రహ్మారెడ్డి వర్గం సాంబిరెడ్డిపై ఎటాక్ చేసి చంపారన్నది ఆయన పై పడ్డ అభియోగం.అయితే అప్పటినుండి ఆయన రాజకీయాలకు  దూరంగాఉంటూ వచ్చారు. అలాంటి ఆయన్ను మరలా చంద్రబాబు మళ్లీ మాచర్లకు పిలిపించి టికెట్ ఇప్పించి టీడీపీ పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆయన్ను గుర్తించిన టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇస్తానందని లోకల్ టాక్.దానికి అనుగుణంగా బ్రహ్మారెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి మాచర్లలో అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చారు.అయితే చంద్రబాబు చేసిన ఇలాంటి పనికి పిన్నెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మరలా మాచర్లను రక్తసిక్తం చేయడానికే చంద్రబాబు బ్రహ్మారెడ్డిని దించారాని పిన్నెల్లి వర్గం అంటున్నారు. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇపుడే ఇలా ఉంటే రేపు కౌంటింగ్ అయ్యాక పరిస్థితిని గుర్తుతెచ్చుకుంటే ఒణుకు వస్తుందని ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: