భూమా ఫ్యామిలీలో ఎన్నికల చిచ్చు తప్పదా?
అయితే.. ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లలో ఇలాంటి వివాదాలు సాధారణమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంలో కూడా ప్రస్తుతం వివాదాలు మొదలయ్యాయి. అంతకు ముందు జగన్, షర్మిల, విజయమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ప్రస్తుతం షర్మిల వేరే పార్టీ పెట్టుకుని తెలంగాణలో ముందుకు సాగుతున్నారు. ఏపీలో జగన్ వైసీపీ ఛాన్స్ ఇవ్వడం లేదని కనీసం రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని వేరే కుంపటి పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
తెలుగు దేశం నేత హరికృష్ణ చనిపోయినపుడు ఆయన ఫ్యామిలీ దగ్గరయ్యారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దగ్గరయ్యారు. కానీ ఆ కుటుంబానికి నందమూరి కుటుంబం అందరితో కలివిడిగా ఉండడం లేదు. ఎన్టీరామారావు బతికి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య చాలానే గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
కోడెల శివప్రసాద్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంలో కూడా వివాదాలు మరింత ముదిరాయి. అంతకుముందు కూడా ఆయనకు చాలా వరకు గొడవలు జరిగాయి. చల్లా రామ కృష్ణ ఫ్యామిలీలో కూడా వివాదాలు చెలరేగాయి. ఇలా క్రమంగా రాజకీయ నాయకుల ఇళ్లలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పేరుకు పెద్ద ఫ్యామిలీలు కానీ వివాదాలు మాత్రం ఎప్పుడు చెలరేగుతూనే ఉంటాయి.