ఆ విషయంలో రష్యాను తప్పుబట్టిన ఇండియా?

నల్ల సముద్రంపై వాణిజ్య నౌకలకు తప్ప యుద్ధ నౌకలకు అనుమతులు ఇవ్వలేమని గతంలోనే ఐక్యరాజ్య సమితి తో ఒప్పందం చేసుకుంది రష్యా. ఆ తర్వాత నల్ల సముద్రంలోకి వాణిజ్య నౌకలను కూడా నిషేధించింది రష్యా. ఏమిటి అని అడిగితే రష్యాలోని క్రెంచ్ వంతెనపై చేసిన దాడి వల్ల ఇలా చేస్తున్నామని చెప్పింది. అంతే కాకుండా వాణిజ్య నౌకలలో   అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలను తరలిస్తున్నాయని చెప్పుకొచ్చింది రష్యా.

దానికి నిదర్శనంగా రెండు నౌకలలో ఆయుధాలను కూడా చూపించింది. ఉక్రెయిన్ నుంచి మిగిలిన దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమల రవాణా రష్యా యొక్క ఈ కండిషన్‌తో ఆగిపోయింది. అయితే అన్ని దేశాల పైన  తటస్థ భావంతో ఉండే భారతదేశం మొన్న ఐక్యరాజ్య సమితిలో రష్యా పై జరిగిన  చర్చలో పాల్గొంది. నిజం చెప్పాలంటే రష్యా దగ్గర నుండి ఆయిల్ ని మిగిలిన దేశాల కన్నా తక్కువ ధరకే కొంటుంది.

రష్యా దగ్గర నుండి రోజుకి 12 లక్షల బ్యారెళ్ళ ఆయిల్ కొంటున్నాం. గతంలో చెల్లించే 47 డాలర్ల కన్నా ఇప్పుడు ధర కొంచెం ఎక్కువ అయినా ఆఫ్రికా, అమెరికా,  అరబ్ దేశాల కన్నా తక్కువ ధరకే కొంటున్నాం. ఒక పక్కన రష్యాతో స్నేహం కొనసాగిస్తున్నాం. ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో ఇప్పుడు రష్యాపై వ్యతిరేక స్టాండ్ ని తీసుకుంది. రష్యా ఆహార ధాన్యాలు ఎగుమతిని ఆపివేయడం అనే పాయింట్ పైన జరిగిన ఈ చర్చలో భారత్ రష్యా చర్యను తప్పు పట్టింది.

ఆహార ధాన్యాలను ఎగుమతిని ఆపివేసే హక్కు ఏ దేశానికి లేదని రష్యా చర్యను తప్పుపట్టింది. రష్యా ఎగుమతుల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని భారత్ గట్టిగా చెప్పింది. గతంలో రష్యాపై జరిగిన  తీర్మానాలను దేనినీ సమర్థించలేదు భారత్. అలాగని సమర్ధించినట్లుగా ఉన్నా కూడా ఏ దేశం పైన అయినా తటస్థ భావంతోనే ఉంటుంది భారత్. అదే భారత్ యొక్క విశిష్ట ధోరణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: