నారాయణ మరదలు కేసు.. ఒక్క ముక్క కూడా రాయరేం?

నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకులడు నారాయణపై ఆయన మరదలు తన మాటల దాడిని కొనసాగిస్తూనే ఉంది. నారాయణ విద్యాసంస్థలను తనవి కావని తాను రాజకీయాల్లోకి వచ్చేశానని ఆయన కోర్టులో చెప్పారు. పోయిన సారి నారాయణ టీడీపీ తరఫున గెలిచి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం నెల్లూరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే నారాయణ మరదలు ప్రియ చాలా ఆరోపణలు చేసింది. ఆమె మాటల్ని ఎల్లో పత్రికలు ఎందుకు రాయడం లేదు. అదే వైఎస్ జగన్ ఇంట్లో పని మనిషికి ఏదైనా ఇబ్బంది తలెత్తినా పుంఖాను ఫుంఖానులుగా వార్తలు రాస్తాయి. మరి నారాయణకు సంబంధించి ఎందుకు రాయడం లేదు. ఇది న్యూస్ కాదా.. నారాయణకు సంబంధించిన వార్తలు రాయకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసుందా అని వైసీపీ పార్టీ నేతలతో పాటు చాలా మంది ఆయా మీడియా సంస్థల్ని ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాంగ బద్ధంగా గవర్నర్, రాష్ట్రపతిని కోర్టుకు పిలవకూడదు. రాజ్యాంగంలో వారికి సంబంధించి ప్రత్యేకంగా హక్కులు ఉన్నాయి. అదే విధంగా మీడియాలో నారాయణ గురించి రాయకూడదని ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఒక మహిళ సొంత మరదలు నాపై లైంగికంగా వేధించడానికి ఆరోపణలు చేస్తుంటే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఒక్క వార్త కూడా రాయడం లేదు. ప్రస్తుతం నారాయణ కు సంబంధించి అంశంపై రాయకపోవడంపై రెండు మీడియా సంస్థల తీరును అందరు ప్రశ్నిస్తున్నారు.

తమకు కావాల్సినవి మాత్రమే వార్తలని, మిగతావి కావని అనే విధంగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని తెలుసుకోవాలి. వార్తా ప్రపంచంలో ప్రతి ఒక్కరిపై అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. ఎవరో చేసినంత మాత్రానా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాజీ మంత్రిపై తన సొంత మరదలు లైంగిక ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కనీసం వార్త రాయకపోవడం శోచనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: