పవన్‌ను లైట్‌గా తీసుకుంటున్న బాబు.. అదే ధైర్యమా?
ఒకవేళ ఇద్దరు కలిసి పోటీ చేసినా వారికి 10,15సీట్లు మాత్రమే వస్తాయని ఒక లెక్క. ఆ 10,15సీట్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల నుంచి పోతాయి గానీ అవి తన ఓట్లు కావని తెలుగుదేశం పార్టీకి ధైర్యంగా ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తెలుగు దేశం పార్టీ 40% ఓటు రేటును సాధించింది. కాబట్టి జనసేన అలాగే బీజేపీ లలో తన మీద కోపంగా ఉన్నవారు అవతల పార్టీకి ఓటు వేసి గెలిపించారని అర్థమవుతుంది.
అంటే ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీవి కాదని నిర్ధారణ అవుతుంది. స్థానిక ఎన్నికల తర్వాత మండలి ఎన్నికలతో చదువుకున్నవారు తమకు మద్దతుగా ఉన్నారనే విషయం అర్థమైంది తెలుగు దేశం పార్టీకి. ఆ కారణం మీదే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించింది. అలాగే దీంతో మధ్యతరగతి వరకు వారు కూడా తమ వైపు వచ్చేసారనే ధీమా ఏర్పడింది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకులను అలాగే పేదల ఓటు బ్యాంకులను చీల్చడం అనేది ఇప్పుడు ప్రధానం. కాపు రిజర్వేషన్ అంశం వల్ల తెలుగుదేశం పార్టీకి దూరమైన బీసీ వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకోగలగాలి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు 40 శాతం నుండి 50 శాతం వరకు పెరుగుతుందని అంటున్నారు.