బీజేపీని కాపాడుతున్న మోడీ క్రేజ్‌?

ప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని సమాచారం. ఇలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలన్నిటికీ మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక గురువులా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలన్నింటికీ మార్గ నిర్దేశం చేసే పనిలో పడ్డారు ఇప్పుడు మన నరేంద్ర మోడీ. ఆల్రెడీ యోగాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకువెళ్లి పోయారు మోడీ.

గతంలో యోగా అంటే హిందూ మతానికి సంబంధించింది అని భావించే వారు చాలా దేశాలు వారు. ప్రత్యేకించి అరబ్ కంట్రీస్ లాంటి ముస్లిం దేశాలు అయితే యోగాని పాటించేవారు కాదు. అమెరికా, యూరోప్ లాంటి దేశాలు కూడా డబ్బులు ఖర్చు పెట్టి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ తీసుకునే వారు కానీ యోగాని ఇదివరకు ఎప్పుడూ ఫాలో అయ్యే వారు కాదు. కానీ ఇప్పుడు  పద్ధతి మారింది. యోగాని ఒక మత విధానంగా చూసే దేశాలు కూడా ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ లా భావిస్తున్నాయట.

ఇది మంచి పరిణామం అని అంటున్నారు రాజకీయ నిపుణులు.  ప్రపంచ దేశాలు ఎప్పుడూ కూడా ఏ దేశం దగ్గర  పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు దొరుకుతాయి అనేదే ఆలోచిస్తూ ఉంటాయి. వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ గ్రిడ్జ్స్ ఏర్పాటు చేసుకుందామని సలహా ఇచ్చారట నరేంద్ర మోడీ. ఎలక్ట్రికల్ విండ్ పవర్ వైపుగా, అణు విద్యుత్ వైపుగా ముందుకు వెళ్దాం అని మోడీ ఇచ్చిన సలహా మేరకు ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు.

అయితే ఇప్పుడు మోడీ ప్రపంచ దేశాలకు నిర్దేశం చూపించడం అటు చైనాకు, పాకిస్తాన్ కు నచ్చడం లేదని తెలుస్తుంది. అంతే కాకుండా మన దేశంలో ఉంటూ, మన దేశాన్ని కించపరిచే వాళ్ళకి కూడా ఈ పద్ధతి నచ్చడం లేదని తెలుస్తుంది. కానీ ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం సుస్థిరం అవ్వాలంటే మళ్ళీ మోడీనే రావాలని కోరుకుంటున్నారు చాలామంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: