బాబు మెడకు సింగపూర్ ఈశ్వరన్ అరెస్టు ఉచ్చు?
కానీ ఆయన కింద ఉండే ఉం బెంగ్ సెన్ సింగపూర్ లోని కొన్ని హోటల్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా హోటల్స్ కు ఆయన అధిపతి అని తెలుస్తుంది. ఈయన ముఖ్యంగా సింగపూర్ రవాణా మంత్రి ఈశ్వరన్ కి అసిస్టెంట్ గా ఉంటాడట. ఈ ఉం బెంగ్ సెన్ అకౌంట్ లోకి వచ్చే కోట్ల రూపాయలతో హోటల్స్ కొనడం గాని, లీజుకు తీసుకోవడం కానీ, మేనేజ్మెంట్ చేయడం గానీ చేస్తూ ఉంటాడట.
అయితే మొన్న సింగపూర్ పోలీసులు రవాణా మంత్రి ఈశ్వరన్, అలాగే ఉం బెంగ్ సెన్ లపై జరిపిన విచారణలో వారి అకౌంట్లోకి ఆంధ్ర నుండి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా బయట పడిందట. ఆంధ్ర నుండి డబ్బులు పంపిణీ జరిగాయంటే అది చంద్ర బాబు నాయుడు కి సంబంధించిన అకౌంట్స్ లో నుండే వచ్చాయని సోషల్ మీడియాలో ఇప్పుడు యాంటీ తెలుగు దేశం వర్గం వాళ్ళు ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నా, ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది. సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మీడియా కనుక పారదర్శకంగా పనిచేస్తే ఆ ఎకౌంట్లోకి వచ్చిన డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో, ఎవరు పంపించారో, ఏ ఉద్దేశంతో పంపించారో చెప్పగలిగితే అప్పుడు అసలు నిజాలు తెలుస్తాయి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.