జగన్ సైలన్స్.. వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

పవన్ కల్యాణ్ గతంలో ప్రభుత్వంలో లేరు. పవన్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. కాబట్టి ఆయన చెప్పుకోవడానికి ఎక్కువగా ఏం లేదు. కాబట్టి ఆయన కేవలం జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వివక్షతను ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని పవన్ కల్యాణ్ చేస్తున్నారు.

పవన్ తన విమర్శల్ని పెంచేశారు. మొన్నటి వరకు జగన్ రెడ్డి అని పిలిచే వారు. ప్రస్తుతం జగ్గు బాయ్ అని సీఎం ని అనడంతో వైసీపీ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తే వాలంటీర్, సచిలవాయ వ్యవస్థను తీసేస్తామని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విధానాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు. కేవలం జగన్ నిశ్శబ్దం వెనక ఉన్న కారణాలు ఏమిటనే చర్చ తెగ నడుస్తోంది.

జగన్ మౌనం వెనక వ్యుహాం ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంటున్నారు. పవన్ కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దానికి స్పందించడం వల్ల జగన్ క్రెడిబిలిటీ దెబ్బ తింటోందని అంటున్నారు. వాలంటీర్లు వద్దంటే ఓటేయరు. సచివాలయం కావాలంటే ఓటేస్తారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ను తీసేస్తామని చెబుతూ  ప్రజల పొట్ట కొట్టాలని చూస్తున్నారని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

చేనేత ప్రోగ్రాంలో వైసీపీ వచ్చిన తర్వాత ఏమేం పథకాలు ప్రవేశపెట్టాం, రాబోయే రోజుల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనే వివరాలు చెబుతూనే టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలకు చివర్లో జగన్ సమాధానం చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, టీవీ 5 ఇతర చానళ్లతో పాటు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను బయట పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని అందరూ వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: